తెలంగాణ

telangana

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: హైకోర్టు

By

Published : Jan 31, 2023, 10:36 AM IST

Updated : Jan 31, 2023, 10:58 AM IST

TS HC on Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. పిల్‌పై కేఏ పాల్‌ స్వయంగా వాదనలు వినిపించారు. రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ రూపొందించారని ఆయన వెల్లడించారు.

KA Paul Arguments On Kamareddy Master Plan
KA Paul Arguments On Kamareddy Master Plan

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: హైకోర్టు

TS HC on Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం విచారణ జరిపింది. కేఏ పాల్‌ స్వయంగా వాదనలు వినిపించారు.

Kamareddy Master Plan Issue Updates: రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ రూపొందించారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేసినట్టు మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించిందన్నారు. అయితే మాస్టర్ ప్లాన్‌ ముసాయిదా రద్దుచేసే అధికారం కౌన్సిల్‌కు లేదని.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పాల్ వాదించారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దుపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం ప్రకటించలేదన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.

అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే..?రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్‌ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు.

మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు. 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక జోన్ కోసం 1200 ఎకరాలతో 8.5 శాతం ప్రతిపాదించారు. ఇందులో నేషనల్ హైవే పక్కన పచ్చని పంటలు పండే.. అడ్లూర్, ఇల్సిపూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూములను చూపారు.

భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుంది: దీనివల్ల ఈ భూములు రెసిడెన్షియల్ కింద పనికిరావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఈ భూములకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణం కూడా కష్టమవుతుందని భావించిన రైతులు ఆందోళనబాట పట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 31, 2023, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details