తెలంగాణ

telangana

కాంగ్రెస్​ ర్యాలీ నేపథ్యంలో దిల్​సుఖ్​నగర్​లో ఉద్రిక్తత​... దుకాణాలు మూసివేయించిన పోలీసులు

By

Published : Oct 2, 2021, 3:04 PM IST

Updated : Oct 2, 2021, 4:45 PM IST

High alert in Dilsukhnagar
High alert in Dilsukhnagar

15:03 October 02

కాంగ్రెస్​ ర్యాలీ నేపథ్యంలో దిల్​సుఖ్​నగర్​లో ఉద్రిక్తత​... దుకాణాలు మూసివేయించిన పోలీసులు

కాంగ్రెస్​ ర్యాలీ నేపథ్యంలో దిల్​సుఖ్​నగర్​లో హై అలర్ట్​... దుకాణాలు మూసివేయిస్తున్న పోలీసులు

హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌కు కాంగ్రెస్‌ పిలుపునివ్వగా.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్ వరకు ర్యాలీ చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ర్యాలీకి వెళ్లకుండా రేవంత్‌రెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు అతని ఇంటివద్ద భారీగా మోహరించారు.  ఆయన ఇంటిని చుట్టుముట్టారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగారు. దిల్​సుఖ్‌నగర్ రాజీవ్‌చౌక్‌ వద్ద ముందస్తు ర్యాలీ తీయకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్​ నేతల గృహనిర్బంధం

ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీతక్కను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ మూసివేత

మరోవైపు, దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ దుకాణాలను మూసివేయిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ర్యాలీ చేపడతానని రేవంత్‌ ప్రకటించడంతో అప్రమత్తమైన అధికారులు.. దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ను మూసివేశారు.

రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దిల్‌సుఖ్‌నగర్‌- ఎల్బీనగర్‌ రూట్‌లో ఈ ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్‌ జాం అవుతుందని పోలీసులు తెలిపారు. ర్యాలీ నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే, ఈ ర్యాలీ ఎలాగైనా చేపట్టి తీరుమతాని రేవంత్‌ ప్రకటించారు. కాంగ్రెస్‌ శ్రేణులు సాయంత్రం 4గంటల కల్లా దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకోవాలని, లాఠీఛార్జికి భయపడాల్సిన అవసరం లేదని రేవంత్‌ పిలుపునిచ్చారు.

100మందికి పైగా..

    కాంగ్రెస్‌ శ్రేణులు దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకొనేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో రేవంత్‌ అక్కడికి వెళ్లకుండా అడ్డుకొనేందుకు దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు. అయితే, రేవంత్‌ ఇంట్లో లేనట్టు సమాచారం. అయితే, 4గంటలకు అంతా ఒకేసారి రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండటంతో దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు పోలీసులు మోహరించారు. అలాగే, కాంగ్రెస్‌ శ్రేణులు ప్రగతిభవన్‌ వైపు వెళ్లే అవకాశం కూడా ఉండటంతో ఆ పరిసరాల్లోనూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినట్టు సమాచారం.

ఇదీ చదవండి: No permission for Jung Siren Rally : ర్యాలీకి అనుమతిలేదు.. అడ్డుకుంటే సహించేది లేదు

Last Updated : Oct 2, 2021, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details