తెలంగాణ

telangana

భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్​

By

Published : Sep 27, 2022, 4:11 PM IST

Updated : Sep 27, 2022, 5:28 PM IST

Hyderabad Rains Today: హైదరాబాద్‌లో రెండో రోజు పలు ప్రాంతాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ రోజు పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసిమద్దయ్యారు. రహాదారుల పైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

Hyderabad Rains
Hyderabad Rains

Hyderabad Rains Today: హైదరాబాద్​లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపించాడు. రెండో రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వానహోరుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బేగంబజార్, ట్రూప్​బజార్, నాంపల్లి, బషీర్​బాగ్, లక్డీకపూల్​ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. నారాయణగూడ, హైదర్​గూడ, హిమాయత్​నగర్ సికింద్రాబాద్‌, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైస్ , చిలకలగూడ, అల్వాల్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.

మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్‌, నెరేడ్‌మెట్‌, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్‌, వనస్థలిపురం, మీర్‌పేట్‌, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌, మలక్‌పేట్, సైదాబాద్, మాదన్నపేట, సంతోష్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్​

రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు: రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి, మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు వాయువ్య దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని వెల్లడించారు.

ఇది సముద్రమట్టానికి 3.1కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని చెప్పారు. మరొక ఉపరితల ఆవర్తనం ఈశాన్య దాని అనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ ఒకటిన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు తెలియజేశారు.

ఇవీ చదవండి:ఏపీని మూడు రాష్ట్రాలు చేస్తే.. ఆ ముగ్గురూ ముఖ్యమంత్రులు కావొచ్చు: జగ్గారెడ్డి

సుప్రీంకోర్టు విచారణలు లైవ్​లో చూడాలా? ఈ లింక్​పై క్లిక్ చేయండి!

Last Updated :Sep 27, 2022, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details