తెలంగాణ

telangana

నేటి నుంచి వెబ్​సైట్​లో ఇంటర్​ హాల్​టికెట్లు

By

Published : Feb 28, 2020, 5:08 AM IST

Updated : Feb 28, 2020, 11:56 AM IST

ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. విద్యార్థులు నేరుగా హాల్​టికెట్ డౌన్​లోడ్ చేసుకోవచ్చని... దానిపై ఎవరి సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు.

hall tickets will be available in telangana intermediate board website for inter students
నేటి నుంచి వెబ్​సైట్​లో ఇంటర్​ హాల్​ టికెట్లు

నేటి నుంచి వెబ్​సైట్​లో ఇంటర్​ హాల్​టికెట్లు

మార్చి 4న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,339 పరీక్ష కేంద్రాల్లో, ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్, 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వెల్లడించారు.

హాల్​టికెట్లు ఆపవద్దు

మొదటి సంవత్సరంలో 4,80,516 మంది, రెండో సంవత్సరం 4,85,323 మంది కలిపి మొత్తం 9,65,839 మంది ఇంటర్​ పరీక్షలకు హాజరు కానున్నట్లు చిత్రా రామచంద్రన్​ వెల్లడించారు. కళాశాల ప్రిన్సిపల్స్​ ​ తమ లాగిన్ ఐడీ ద్వారా హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించారు. ఫీజు చెల్లించలేదని, మరే ఇతర కారణాలతో విద్యార్థులకు హాల్​టికెట్లను ఆపవద్దని కళాశాల యాజమాన్యానికి స్పష్టం చేశారు.

తప్పులుంటే సరిచేసుకోండి

విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్​సైట్ నుంచి నేరుగా హాల్​టికెట్లను డౌన్​లోడ్ చేసుకోవచ్చని చిత్రా రామచంద్రన్ తెలిపారు. హాల్​టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేదని... దానిపై ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. విద్యార్థులు హాల్​టికెట్లు పూర్తిగా పరిశీలించి.. తప్పులుంటే కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా సరిచేసుకోవాలని ఆమె సూచించారు.

ఆన్​లైన్​లో ఫిర్యాదులు

విద్యార్థుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు ప్రతి జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్​సైట్​లోని బిగ్ ఆర్​ఎస్ ద్వారా ఆన్​లైన్​లో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

లొకేటర్​ యాప్

పరీక్షా కేంద్రం ఎక్కడుంది.. ఎలా వెళ్లాలో తెలిపే లొకేటర్ మొబైల్ యాప్​ను రూపొందించినట్లు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. విద్యార్థులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి TSBIE m-serivces యాప్ డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించారు.

నిమిషం ఆలస్యమైనా.. అనుమతించం

పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకోవాలని.. ఉదయం 8 నుంచి లోనికి అనుమతిస్తామని చెప్పారు. ఉదయం 9 గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా... ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

ఇవీచూడండి:'అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి'​

Last Updated : Feb 28, 2020, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details