తెలంగాణ

telangana

పీడీఎఫ్‌ రూపంలో ఇంటర్‌ పాఠ్యాంశాలు

By

Published : May 25, 2021, 7:26 AM IST

విద్యార్థులు టీవీల ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలను వింటూనే సులభంగా వాటిని అర్థం చేసుకొని చదువుకునేందుకు వీలుగా పీడీఎఫ్‌ రూపంలో మెటీరియల్‌ను అందించాలని ఇంటర్‌బోర్డు యోచిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తి చేసింది.

government-trying-to-inter-study-material-in-pdf-format
పీడీఎఫ్‌ రూపంలో ఇంటర్‌ పాఠ్యాంశాలు

గత ఏడాది కరోనా సమయంలో అధ్యాపకులతో ముందుగా ఇంటర్​ పాఠాలను రికార్డు చేయించి.. వాటిని సెప్టెంబరు 1 నుంచి దూరదర్శన్‌ ద్వారా ప్రసారం చేశారు. ఈసారి వాటితోపాటు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి ప్రశ్నలు-జవాబులు, ముఖ్యాంశాలను పీడీఎఫ్‌ రూపంలో తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందులో ఉంచుతారు. వాటిని విద్యార్థులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. అంతేకాకుండా ఎంత మంది ఏయే పాఠాలు, ఎంత సమయం చదివారు లాంటి వివరాలను కూడా యాప్‌ ద్వారా తెలుసుకునేలా ఉండాలన్నది ఆలోచిస్తున్నారు.

ముందుగానే ఆన్‌లైన్‌ పాఠాలు...

కార్పొరేట్‌తోపాటు మరికొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలతో పోటీపడేందుకు ఈసారి ప్రభుత్వ కళాశాలల్లో గతంలో కంటే రెండు నెలల ముందుగా ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పాటు నెలాఖరు వరకు వేసవి సెలవులు ఉన్నందున జూన్‌ 1న నిర్వహించే సమీక్ష సందర్భంగా తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ నెలాఖరులో పరీక్షలు జరపాలని భావిస్తున్నారు. అదే ఖరారైతే అవి ముగిసిన వెంటనే ఆన్‌లైన్‌ తరగుతులు మొదలుపెట్టే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:ఏపీ​లోకి ప్రవేశించే ప్రయాణికులు ఈ-పాస్​ తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details