తెలంగాణ

telangana

TSPSC: టీఎస్​పీఎస్సీలో 10 కొత్త పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం

By

Published : Apr 21, 2023, 7:17 PM IST

Updated : Apr 21, 2023, 9:33 PM IST

tspsc
tspsc

19:13 April 21

సీనియర్, జూనియర్ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు మంజూరు

TSPSC NEW POST NOTIFICATION: పేపర్‌ లీకేజీతో టీఎస్​పీఎస్సీ బలోపేతం దిశగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కమిషన్‌కు పది కొత్త పోస్టులను మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేసింది. అదేవిధంగా సీనియర్, జూనియర్ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్‌, జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు టీఎస్​పీఎస్సీ పంపిన ప్రతిపాదనలు సర్కార్‌ ఆమోదించింది.

ఆన్​లైన్​లోనే ఏఈఈ పరీక్ష:ఏఈఈ సివిల్ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు గతంలో పేర్కొన్న టీఎస్‌పీఎస్సీ.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మే 21, 22 తేదీల్లో నాలుగు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. ఏఈఈ సివిల్ పరీక్షను 44,352 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర నియామక బోర్డుల తరహాలో నార్మలైజేషన్ విధానంలో తుది స్కోరును ఖరారు చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వెలుగు చూడటంతో జనవరి 21న జరిగిన ఏఈఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తోంది.

అదనపు కార్యదర్శిగా సంతోష్: టీఎస్​పీఎస్సీ అదనపు కార్యదర్శి పదవికి కొత్త ఐఏఎస్​ అధికారిని నియమించింది. ఐఏఎస్ బీఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సంతోష్‌ పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించనున్నారు. ఈ నియామకంతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌ బాధ్యతల నుంచి సంతోష్‌ను బదిలీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 21, 2023, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details