తెలంగాణ

telangana

Gold Seized at Shamsabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టివేత

By

Published : Jul 18, 2023, 10:32 PM IST

Gold Smugglers in Hyderabad : విదేశాల నుంచి హైదరాబాద్​లోకి అక్రమంగా బంగారాన్ని కొంత మంది వ్యక్తులు తరలిస్తున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా కువైట్​ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికుల దగ్గర నుంచి సుమారు రూ.కోటి విలువైన 1.725 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

Gold Seized at Shamsabad Airport
Gold Seized at Shamsabad Airport

Two Gold Smugglers Arrested in Shamshabad Airport: కొంతమంది తక్కువ కాలంలోనే ధనవంతుల కావాలనే ఉద్ధేశంతో అక్రమ మార్గాలని అన్వేషిస్తున్నారు. వారి తెలివితేటలను అక్రమంగా రవాణా చేస్తున్న సరుకును పోలీసులకు కనిపెట్టకుండా ఎలా తీసుకెళ్లాలనే ఆలోచిస్తున్నారు. వారు ఆ విధంగా ఆలోచించి ఎంత పని చేయడానికైనా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా హైదరాబాద్​లో జరుగుతున్నాయి. విదేశాల నుంచి దొంగ మార్గాల ద్వారా బంగారాన్ని తీసుకువస్తున్నారు. ఈ విషయం కస్టమ్​ అధికారులు గుర్తించి వారిని పట్టుకుంటున్నారు. ఇటీవలే నలుగురిని పట్టుకోగా.. తాజాగా మరో ఇద్దరిని అధికారులు అరెస్ట్​ చేశారు.

కస్టమ్​ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. : కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు కస్టమ్​ అధికారులకి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిని పరిశీలించగా.. నిందితుడి దగ్గర రూ.72.55లక్షలు విలువైన 1225 గ్రాములు బంగారం ఉందని గుర్తించారు. ఇదే విధంగా మరో వ్యక్తి కువైట్​ నుంచి డోహ మీదుగా హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడ్ని అధికారులు పరిశీలించారు. ఆ నిందితుడి దగ్గర రూ.30.51లక్షలు విలువైన 500 గ్రాములు బంగారం గుర్తించి.. పట్టుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల దగ్గర నుంచి మొత్తం కోటి రూపాయలు విలువ చేసే 1.725 కిలో గ్రాముల బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి ఇరువురిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

అదే విమానశ్రయంలో పట్టుబడిన మరో నలుగురు : ఈ విధంగానే ఈ నెల 10 నుంచి 12 తేదీల మధ్యలో నలుగురు నిందితులను కస్టమ్​ అధికారులు పట్టుకున్నారు. వారిని ఒక్కొక్కరి ఒక్కో విధంగా బంగారాన్ని అక్రమంగా తీసుకుని వచ్చారు. ఆ నిందితుల్లో ఒకడు బంగారాన్ని పేస్ట్​ రూపంలో చేసి.. మలద్వారం దగ్గర దాచుకొని ప్రయాణించాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు నిందితుడి దగ్గర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Gold Smuggling Cases in Hyderabad: అలానే మరో మహిళ తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచింది. ఆ విషయాన్ని అధికారులు తెలుసుకున్నారు. తన దగ్గర ఉన్న ఆభరణాలను తీసుకున్నారు. మరో ఇద్దరు ప్రయాణికులు ఈ విధంగానే బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. వారందరిపై కేసు నమోదు చేశారు. ఈ విధంగా అక్రమంగా బంగారాన్ని, గంజాయిని తరలించడం చట్టరీత్యా నేరమని.. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకి, పోలీసులకి తెలియజేయాలని అధికారులు సూచనలు ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తారని హెచ్చరించారు. ఆ నలుగురు నిందితుల కేసు వివరాల పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details