తెలంగాణ

telangana

బ్యాంకు భవనంలో అగ్ని ప్రమాదం

By

Published : May 22, 2019, 5:14 AM IST

Updated : May 22, 2019, 7:30 AM IST

హైదరాబాద్​లోని ఓ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. అర్థరాత్రి బ్యాంకు భవనం నుంచి పొగలు రావడం వల్ల కాలనీ వాసులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారు.

అర్ధరాత్రి బ్యాంకు భవనం నుంచి పొగలు

హైదరాబాద్ వెస్ట్ శ్రీనివాస్​నగర్​లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి బిల్డింగ్​లో నుంచి పొగలు రావటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
బ్యాంకులోని ఏసీ విభాగంలోని బాక్సులు పేలి విద్యుదాఘాతం జరగడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. బ్యాంకుపైనే బాలికల వసతి గృహం ఉండటం, పొగలను సకాలంలో గుర్తించి అదుపు చేయటం వల్ల భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

అర్ధరాత్రి బ్యాంకు భవనం నుంచి పొగలు
This is test file from feedroom
Last Updated : May 22, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details