తెలంగాణ

telangana

కొత్త ఏడాది వేడుకల్లో డ్రగ్స్‌, అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ నిఘా..!

By

Published : Dec 30, 2022, 9:28 PM IST

Drugs
Drugs

నూతన సంవత్సర వేడుకలకు జంట నగరాలు సిద్ధమవుతున్నాయి. కొత్త ఏడాది సంబురాల దృష్ట్యా డ్రగ్స్‌, అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇప్పటికే 14 బృందాలతో ఎక్సైజ్‌ శాఖ భాగ్యనగరంలో భద్రతా చర్యలకు సిద్ధమైంది.

నూతన సంవత్సర సంబురాల దృష్ట్యా నగరంలో మాదకద్రవ్యాలు, అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ నిఘా పెట్టింది. మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లపై ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో నిఘా ఉంచేందుకు 14 ప్రత్యేక బృందాలను ఆబ్కారీ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ నియమించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో నాలుగు బృందాలు మొత్తం ఆరుగురు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల పరిధిలో ఆరు బృందాలు, ఇద్దరు ఏసీల పరిధిలో రెండు, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు బృందాలు మొత్తం 14 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details