తెలంగాణ

telangana

Fire department: '94శాతం మందికి పైగా సిబ్బందికి మొదటి డోసు పూర్తి'

By

Published : Jun 3, 2021, 5:46 PM IST

రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే అగ్నిమాపక శాఖ సిబ్బంది కరోనా బారిన పడకుండా ఆ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. సిబ్బందికి వైరస్‌ సోకకుండా అవగాహన కల్పించడంతో పాటు ప్రతి ఫైర్‌ స్టేషన్‌కు శాఖ ఉన్నతాధికారులు మాస్కులు, శానిటైజర్లు సరఫరా చేస్తున్నారు. ఈ శాఖలో మొత్తం 2,113 మంది పనిచేస్తుండగా వీరిలో టీకా మొదటి డోసు 94 శాతం మందికి పూర్తయింది. రెండో డోసు 55 శాతం మందికి పూర్తయింది అంటున్న అగ్నిమాపక శాఖ అధికారి పాపయ్యతో 'ఈటీవీ భారత్‌' ప్రతినిధి శ్రీనివాస్‌ ముఖాముఖి.

corona precautions in fire department
అగ్ని మాపక శాఖలో కరోనా నివారణ చర్యలు

94శాతం మందికి పైగా మొదటి డోసు పూర్తి: పాపయ్య

'మా శాఖలో ఇప్పటికి దాదాపు 500 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వారంతా కోలుకున్నారు. ఇద్దరు కొవిడ్‌తో చనిపోవడం బాధాకరం. ప్రభుత్వ సహకారంతో సిబ్బంది కుటుంబసభ్యులకు కూడా వ్యాక్సినేషన్‌ వేస్తున్నాం. కొవిడ్‌ బారిన పడిన మా సిబ్బందిని నిరంతరం పర్యవేక్షిస్తూ వారిలో మనో ధైర్యాన్ని కల్పిస్తున్నాం.'

పాపయ్య, అగ్నిమాపక శాఖ అధికారి

ఇదీ చదవండి:Revanth Reddy: ఉప్పల్​ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా

ABOUT THE AUTHOR

...view details