తెలంగాణ

telangana

బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటైతే నేనేందుకు గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తా : ఈటల

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 2:55 PM IST

Etela Comments on CM KCR : బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటైతే తాను కేసీఆర్‌పై గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేస్తానని.. బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్‌, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలను బీఆర్​ఎస్​ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ ఒక్కటేనన్న ఈటల.. కేసీఆర్​ను గద్దె దించాలంటే బీజేపీకే సాధ్యమని వ్యాఖ్యానించారు.

Etela fires on KCR
Etela Respond on Gajwel Constituency Contest

బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటైతే నేనేందుకు గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తా : ఈటల

Etela Comments on CM KCR :బీఆర్ఎస్​ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని.. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్​ అన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటైతే తాను కేసీఆర్‌పై గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేస్తానని. ప్రశ్నించారు. బీఆర్ఎస్ పేదల భూములను లాక్కొని.. భూ దందాలకు పాల్పడుతోందని ​ఆరోపించారు.

Etela Coments on KCR Govt :అభివృద్ధి పేరుతో ప్రజల అసైన్డ్​ భూములను గుంజుకుంటూ.. ప్రభుత్వమే రియల్​ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఈటల(Etela Rajender) దుయ్యబట్టారు. అభివృద్ధి పేరుతో, ల్యాండ్​ ఫూలింగ్​ చేసి రియల్​ ఎస్టేట్​ దందాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పేదల భూములను లాక్కొని దళితులను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క గజ్వేల్‌ నియోజకవర్గంలోనే 30 వేల కేసీఆర్‌ బాధిత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.

"డబుల్​ బెడ్​రూం ఇళ్లు, దళితబంధు, నిరుద్యోగ భృతి, బీసీబంధు ఇస్తానని చెప్పి మాయమాటలతో కేసీఆర్​ ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణ సంపన్న రాష్ట్రమని చెప్పే కేసీఆర్​​.. పథకాలను ప్రజలందరికి ఎందుకు ఇవ్వడంలేదు. నేడు రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఏపూటకు ఆ పూట ఖర్చు పెట్టుకునే విధంగా మారింది. నీళ్లు, నిధులు, నియమాకాల ఆశయంతో ఏర్పడిన తెలంగాణ.. నేడు కేసీఆర్​ పాలనలో సదరు లక్ష్యం నీరుగారిపోయింది. రాష్ట్ర యువతకు ఉద్యోగ నియామాకాల్లో బీఆర్ఎస్​​ పూర్తిగా విఫలమైంది. నేడు రాష్ట్రంలో ఉద్యోగాలు ప్రతిభ ఉన్నవారికి, చదువుకున్నవారికి కాకుండా.. పైరవీలు చేసుకున్నవారికి కొలువులు వచ్చే పరిస్థితి దాపురించింది." - ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే

'తెలంగాణ సమాజం ప్రేమకు లొంగుతుందే తప్ప భయభ్రాంతులకు గురిచేస్తే లొంగదు'

Etela Latest On Telangana Debts 2023 : పొరుగు రాష్ట్రాల్లో అసైన్డ్​ భూములకు హక్కులను కల్పిస్తుంటే.. ఇక్కడ మాత్రం లాక్కుంటున్నారని ఈటల తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్​ చుట్టు పక్కల వేల మంది బాధితులు ఉన్నారని తెలిపారు. 40-50 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములకూ హక్కులు ఇవ్వట్లేదన్నారు. సీఎం కేసీఆర్​ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారందని.. రాష్ట్రం ఏర్పడినప్పుడు 75000 కోట్లుగా ఉన్న అప్పు.. నేడు అయిదున్నర లక్షల కోట్లకు చేరిందని మండిపడ్డారు.

Etela Fires on CM KCR : రాష్ట్రంలో ఉద్యోగులకు, పింఛన్​దారులకు.. సరైన సమయానికి జీతభత్యాలు అందించే పరిస్థితి లేదన్నారు ఈటల. రాష్ట్రంలో 130 బీసీ కులాలుంటే.. కొన్ని కులాలకే బీసీ బంధు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10వేల బీసీ కుటుంబాలుంటే.. కేవలం 10 కుటుంబాలకే బీసీబంధు అందిందని.. అది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే దక్కిందని పేర్కొన్నారు.

"బీఆర్ఎస్​ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని.. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే. బీజేపీ, బీఆర్​ఎస్​ ఒక్కటైతే నేనేందుకు గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తా. బీఆర్ఎస్ పేదల భూములను లాక్కొని.. భూ దందాలకు పాల్పడుతోంది". - ఈటల రాజేందర్​, బీజేపీ నేత

BJP Leaders Comments on BRS Congress : 'బీఆర్ఎస్, కాంగ్రెస్.. బీసీలను మోసం చేశాయి.. కానీ ఓబీసీని పీఎం చేసిన ఘనత బీజేపీది'

Etela Rajender Reacts on Medigadda Barrage : "మేడిగడ్డకు ప్రారంభం నుంచే లీకులు.. కేసీఆరే బాధ్యత వహించాలి "

ABOUT THE AUTHOR

...view details