తెలంగాణ

telangana

Etela Comments On CM KCR : 'జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు చోటే లేదు.. అసలు ఎవరూ పట్టించుకోరు'

By

Published : Jul 19, 2023, 4:00 PM IST

Updated : Jul 19, 2023, 5:26 PM IST

Etela Rajendar Sensation Comments On CM KCR : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు చోటే లేదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ తొలగింపును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలాగే గోషామహల్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లపై అక్రమ కేసులు పెట్టి బెదిరించడంపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Etala Rajendar
Etala Rajendar

Etela Rajendar Fire On KCR : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు కావాల్సిన డబ్బులు సమకూరుస్తానని చెప్పినా.. తెలంగాణ సీఎంను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం నాంపల్లి పార్టీ ఆఫీసులో ఈటల రాజేందర్‌ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ తొలగింపును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలాగే గోషామహల్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లపై అక్రమ కేసులు పెట్టి బెదిరించడం పట్ల ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌ శశికళపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు.

"ఏ పార్టీవారు నమ్మక.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ఎన్నికలకు కావాల్సిన డబ్బులు సమకూరుస్తానని చెప్పినా.. తెలంగాణ సీఎంను ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ తొలగింపును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాను. అన్యాయంగా గోషామహల్‌ బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లపై కేసులు పెట్టారు. కార్పొరేటర్‌ శశికళపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎప్పటినుంచో గోషామహల్‌ బీజేపీకి అడ్డాగా ఉంది వారికి అండగా బీజేపీ ఉంటుంది."-ఈటల రాజేందర్‌, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్

'జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు చోటే లేదు.. అసలు ఎవరూ పట్టించుకోరు'

Etela Met Goshamahal MLA Rajasingh : గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అకారణంగా దాడి చేసిన బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. మీర్‌పేటలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారని దుయ్యబట్టారు. అలాగే బీజేపీ కార్యకర్తలతో గిల్లికజ్జాలు పెట్టుకొని.. బీఆర్‌ఎస్‌ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ అసహననంతో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని ఆరోపణలు చేశారు. వీటన్నింటిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తుందని ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌కు హెచ్చరించారు.

"గోషామహల్‌ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలపైన, బీజేపీ కార్పొరేటర్లపైన పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయిన గోషామహల్‌ను గెలవాలి. బీఆర్‌ఎస్‌, పోలీసులు కలిసి ఇక్కడి కార్పొరేటర్లను భయబ్రాంతులు చేయాలని కుట్రలు చేస్తున్నారు. 13వ తేదీన బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అందుకు మా వాళ్లపై కేసులు పెట్టారు. దెబ్బలు తిన్నవాళ్లపై కేసులు పెడతారా లేక దెబ్బలు కొట్టిన వాళ్లపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. సెక్షన్‌ 306 కింద ఆరుగురు కార్యకర్తలపై కేసులు పెట్టారు."- రాజాసింగ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే

కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పేందుకు ఈటల వచ్చారు : దూల్‌పేటలోని రాజాసింగ్‌ నివాసంలో ఈటల రాజేందర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. అక్కడ ఇద్దరు పలు అంశాలపై చర్చించారు. గోషామహల్‌లో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డికి, ఈటలకు సమాచారం అందించినట్లు రాజాసింగ్ తెలిపారు. తన అభ్యర్థన మేరకు కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చేందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ విషయాలను న్యాయపరంగా ఎదుర్కొందామని భరోసా కల్పించినట్లు పేర్కొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పేందుకు ఈటల వచ్చారు

ఇవీ చదవండి :

Last Updated : Jul 19, 2023, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details