తెలంగాణ

telangana

లోక్​సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - తెలంగాణ రాష్ట్ర నూతన ఇంఛార్జ్​గా దీపా దాస్​మున్షీ

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 11:40 AM IST

Deepa Dasmunsi as Telangana Congress New Incharge : పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాల ఇంఛార్జిలను కాంగ్రెస్‌ అధిష్ఠానం బదిలీ చేయడంతోపాటు మార్పులు చేర్పులు చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జితో పాటు పలు రాష్ట్రాలకు కొత్తగా ఇంఛార్జీలను ప్రకటించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్నమానిక్‌రావ్‌ ఠాక్రేని గోవా, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలికి బదిలీ చేసింది. శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రత్యేక పరిశీలకురాలుగా పని చేసిన దీపాదాస్‌ మున్సీకి కేరళ, లక్షద్వీప్‌లతో పాటు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించింది.

Telangana Congress Focus on Lok Sabha Elections
Congress Reshuffles State Incharges

Deepa Dasmunsi as Telangana Congress New Incharge : దేశంలో రాబోయే పార్లమెంటు ఎన్నికలను కీలకంగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీజేపీని గట్టిగా ఎదుర్కొని అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాలను రచించింది. కాంగ్రెస్‌ తాజాగా వివిధ రాష్ట్రాల ఇంఛార్జీలను బదిలీ చేయడంతోపాటు మార్పులు, చేర్పులు చేసింది.

ఈ నెల 21వ తేదీన దిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించింది. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలాలు, బలహీనతలపై కూడా చర్చించిన సీడబ్ల్యూసీ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందో వ్యూహరచన చేస్తోంది.

Telangana Congress New Incharge :అందులో భాగంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం పలు రాష్ట్రాల ఇంఛార్జిలను బదిలీ చేయడంతోపాటు మార్పులు చేర్పులు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈ మేరకు మార్పలు, చేర్పులు చేసి నియామకాలు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు కీలకం కావడంతో ఆయా రాష్ట్రాల్లో గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో నిలిపి గెలిచేందుకు పార్టీని నిర్మాణం చేయాల్సి ఉంటుందని, అదేవిధంగా బలహీనంగా ఉన్న ప్రాంతాలల్లో పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

లోక్​సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్​కే అనుకూలం : కొండా సురేఖ

Telangana Congress Focus on Lok Sabha Elections :ప్రధానంగా పార్టీ ప్రధాన కార్యదర్శులను, సీనియర్‌ నేతలను వివిధ రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా నియమించడంతో పాటు పార్టీ ఆర్గనైజింగ్‌ బాధ్యులను కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమించింది. ప్రధాన కార్యదర్శులు ముఖుల్‌ వాస్కీని గుజరాత్‌కు, జితేంద్ర సింగ్‌ను అసోంతోపాటు మధ్యప్రదేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

రణ్​దీప్‌ సింగ్‌ సుర్జేవాలాను కర్ణాటకకు, దీపక్‌ బబారియాకు దిల్లీతోపాటు హరియాణాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. చిన్‌ పైలట్‌ను ఛత్తీస్​గఢ్​కు, అవినాష్‌ పాండేను ఉత్తర్‌ప్రదేశ్‌కు, కుమారి సెల్జాను ఉత్తరాఖండ్‌కు, జి.ఎ.మిర్‌ను ఝార్ఖండ్‌తోపాటు పశ్చిమ బంగాల్‌ అదనపు బాధ్యతలు ఇచ్చారు. దీపా దాస్​మున్షీని కేరళ, లక్షద్వీప్‌లతోపాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

టార్గెట్‌ 2024 - పక్కా ప్రణాళికతో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్‌

జైరాం రమేష్‌ను కమ్యూనికేషన్‌, కేసీ వేణుగోపాల్‌ను ఆర్గనైజేషన్‌, అదేవిధంగా రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా నియామకమైన పార్టీ సీనియర్‌ నేతలైన రమేష్‌ చిన్నితలను మహారాష్ట్రకు, మోహన్‌ ప్రకాష్‌ను బీహార్‌కు, చెల్లకుమార్‌ను మేఘాలయ, మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లకు, అజోయ్‌ కుమార్‌ను ఒడిశాతోపాటు తమిళనాడు, పాండిచ్ఛేరిలకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

అదేవిధంగా భరత్‌సిన్హా సోలంకిని జమ్ముకశ్మీర్‌, రాజీవ్‌శుక్లను హిమాచల్‌ ప్రదేశ్‌, చంఢీగఢ్​లకు, సుఖ్జిందర్‌ సింగ్‌ రామ్‌దేవ్‌ను రాజస్థాన్‌కు, దేవేందర్‌ యాదవ్‌ను పంజాబ్‌కు, మానిక్‌ రావ్‌ ఠాక్రేను గోవా డయు డామన్‌, దాద్రా నగర్‌ హవేలికి, గిరిష్‌ చోడాంకర్‌ను త్రిపుర, సిక్కిమ్‌, మణిపుర్​, నాగలాండ్‌లకు, గురుదీప్‌ సింగ్‌ను అడ్మినిస్ట్రేషన్‌ అధికారిగా, కోశాధికారిగా అజయ్‌ మాకెన్‌లను నియమించింది.

లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - ఎంపీలంతా హైదరాబాద్ రావాలని కేసీఆర్ ఆదేశాలు

పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు

ABOUT THE AUTHOR

...view details