తెలంగాణ

telangana

వైఎస్ వివేకా హత్య కేసులో నిజాలేంటో ఇకముందు తెలుస్తాయి: దస్తగిరి

By

Published : Feb 5, 2023, 12:46 PM IST

Dastagiri on viveka murder case: నిజాలేంటో ఇకముందు తెలుస్తాయని వివేకా హత్య కేసులో అప్రూవర్​గా మారిన దస్తగిరి తెలిపారు. ఈరోజు ప్రారంభమైన సీబీఐ విచారణకు ఆయన హాజరయ్యాడు. విచారణలో పాల్గొన్న దస్తగిరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Dastagiri
Dastagiri

Dastagiri on viveka murder case: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతొంది. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన వారిని మలిదశ విచారణలో సీబీఐ విచారిస్తోంది. ఆదివారం ఏపీలోని కడప కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి సీబీఐ ఎదుట హాజరయ్యాడు.

చాలా రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ విచారణలో పాల్గొన్నాడు. ఇంతకాలం దస్తగిరి చెప్పింది అబద్ధమన్నారని.. నిజాలేంటో ఇకముందు తెలుస్తాయని దస్తగిరి వెల్లడించాడు. హైదరాబాద్‌కు కేసు బదిలీ చేయడంపై స్పందిస్తూ.. కేసును సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయటం మంచి పరిణామమేనని తెలిపాడు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్​లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో.. వివేకా హత్య కేసులో ఐదుగురు నిందితులు హాజరుకానున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details