తెలంగాణ

telangana

'విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి'

By

Published : Aug 20, 2019, 3:07 PM IST

రాష్ట్రంలో చదువుతున్న పిల్లలకు సరైన విద్యాసామర్థ్యం లేదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ హైదరాబాద్ ప్రెస్​క్లబ్​లో తెలిపారు.

'విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి'

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన విద్య ఏర్పాటు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చదువుతున్న పిల్లలకు తరగతుల వారీగా వారి విద్యా సామర్ధ్యాల గురించి నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 7 వేల మంది విద్యార్థులు సరళమైన పదాలు కూడా రాయలేక, చదవలేకపోతున్నారన్నారు. అధిక శాతం ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలేనని హైదరాబాద్ ప్రెస్​ క్లబ్​లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఓ సంక్షోభంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దానిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు.

'విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి'
sample description

TAGGED:

ABOUT THE AUTHOR

...view details