తెలంగాణ

telangana

'సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి'

By

Published : Dec 31, 2020, 4:35 PM IST

సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు.

daanam nagender  inaugurated  new community hall  banjara hills
'వారు స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదించండి'

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఏడులో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ.. లబ్ధిదారులుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

ప్రజా ప్రతినిధులను సంప్రదించండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల దృష్టిలో ఉంచుకొని కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించిందని చెప్పారు. ఆడపిల్ల పెళ్లి అంటే భయాందోళనకు గురై పరిస్థితి నుంచి సంతోషంగా వివాహం జరపే స్థాయికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని తెలిపారు. ఈ పథకాల్లో దరఖాస్తు చేసుకొని చెక్కులు అందని వారు స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదించాలని సూచించారు.

ఇదీ చదవండి:'లక్ష్యాలు పెట్టుకోండి... ప్రణాళికలు సిద్ధం చేసుకోండి'

ABOUT THE AUTHOR

...view details