తెలంగాణ

telangana

దిల్లీ మద్యం స్కామ్‌లో ఇద్దరు నిందితుల కస్టడీ పొడిగింపు

By

Published : Nov 17, 2022, 3:31 PM IST

Updated : Nov 17, 2022, 4:09 PM IST

Delhi Liquor Scam Update: దిల్లీ మద్యం స్కామ్‌లో మరో నాలుగు రోజులపాటు రౌస్ అవెన్యూ కోర్టు.. ఇద్దరు నిందితుల కస్టడీ పొడిగించింది. మద్యం కుంభకోణంలో కేసులో ఈడీ అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు మరో వారం రోజుల కస్టడీని ఈడీ కోరగా... శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Liquor case
Liquor case

Delhi Liquor Scam Update: దిల్లీ మద్యం కుంభకోణంలో శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులకు మరో నాలుగు రోజులపాటు రౌస్ అవెన్యూ కోర్టు.. ఈడీ కస్టడీ పొడిగించింది. మద్యం కుంభకోణంలో కేసులో ఈడీ అరెస్టు చేసిన ఇద్దరు నిందితులకు మరో వారం రోజుల కస్టడీని ఈడీ కోరగా... శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

బినోయ్ బాబు విచారణలో వెల్లడైన విషయాల ఆధారంగా కొన్ని సోదాలు నిర్వహించి.. కొన్ని డిజిటల్ ఆధారాలు సేకరించినట్లు ఈడీ కోర్టుకి తెలిపింది. సేకరించిన ఆధారాల ద్వారా తదుపరి విచారణ కోసం శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు కస్టడీ పొడిగించాలని కోరింది. ఈడీ దర్యాప్తునకు శరత్ చంద్రారెడ్డి సహకరించడం లేదని కోర్టుకి ఈడీ తెలిపింది. ఇదే కేసులో అరుణ్ పిళ్ళై, రాజ్ కుమార్​ని ప్రశ్నిస్తే... మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకి విన్నవించింది. దీంతో నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు... తదుపరి విచారణను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా వేసింది.

రేపు అరుణ్ పిళ్లై, బుచ్చిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈనెల 21న రాజ్‌కుమార్ విచారణకు హాజరవుతారని ఈడీ కోర్టుకు తెలిపింది. దిల్లీ మద్యం స్కామ్‌లో ఇప్పటికే సమీర్ మహేంద్రును అరెస్టు చేశారు. సమీర్ జ్యుడీషియల్ కస్టడీ ఈనెల 26 వరకు పొడిగించిన కోర్టు... ప్రశ్నించేందుకు అనుమతిచ్చింది. దాంతో తీహాడ్‌ జైలులో 2రోజులపాటు ఈడీ అధికారులు వీరిని ప్రశ్నించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 17, 2022, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details