తెలంగాణ

telangana

నీలోఫర్‌ ఆస్పత్రిలో సౌకర్యాలు పరిశీలించిన సీఎస్‌

By

Published : Jun 5, 2021, 8:13 PM IST

కొవిడ్​ విజృంభిస్తున్న నేపథ్యంలో నీలోఫర్​ చిన్నారుల ఆస్పత్రిని నోడల్​ కేంద్రంగా మార్చనున్నట్లు సీఎస్​ తెలిపారు. పిల్లలకు కోవిడ్ సోకితే చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

cs somesh kumar
నీలోఫర్‌ ఆస్పత్రిలో సౌకర్యాలు పరిశీలించిన సీఎస్‌

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా హైదరాబాద్‌ నీలోఫర్ చిన్నారుల ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా మార్చనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ ప్రకటించారు. పిల్లలకు కోవిడ్ సోకితే చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. డీఎంఈ రమేష్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఓఎస్డీ గంగాధర్‌తో కలిసి సీఎస్​ నీలోఫర్ ఆస్పత్రిని, ఆ తర్వాత ఎంఎన్​జే క్యాన్సర్‌ ఆస్పత్రిని సందర్శించారు.

కొవిడ్‌ మూడో దశ వచ్చే అవకాశం ఉందన్న నిపుణుల అంచనాతో వివిధ ఆస్పత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నట్టు సోమేశ్‌ తెలిపారు. అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలు సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సీఎస్​ వివరించారు.

నీలోఫర్‌ ఆస్పత్రిలో సౌకర్యాలు పరిశీలించిన సీఎస్‌

ఇదీ చదవండి: Corona:గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు కరోనా సోకే అవకాశం..!

ABOUT THE AUTHOR

...view details