తెలంగాణ

telangana

భాజపా, తెరాస ఒకటేనని నేను మొదటి నుంచీ చెబుతున్నా: రేవంత్​

By

Published : Apr 23, 2021, 6:40 PM IST

తెలంగాణ రాష్ట్ర భాజపాలో కేసీఆర్​ అనుకూల వర్గం, ప్రతికూల వర్గం మధ్య పంచాయితీ నడుస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విమర్శించారు. భాజపా, తెరాస రెండూ ఒకటేనని తాను మొదటి నుంచీ చెబుతున్నానని ఆక్షేపించారు. రేవంత్​ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

congress mp
telangana latest news

భాజపాలో బండిసంజయ్​, కిషన్​ రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రగతి భవన్‌ గేట్లు తెరచుకోవు కాని... భాజపా నేతలకు స్వాగతం పలుకుతాయని విమర్శించారు. వారిద్దరి మధ్యలో మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావును బలిపశువును చేయడం ఏంటని ప్రశ్నించారు.

అక్కడెందుకు చేయలేదు..

జల్‌పల్లి మున్సిపాలిటీలో ఎంఐఎం ఎందుకు ఏకగ్రీవం అయిదని... అక్కడ భాజపా అభ్యర్థిని ఎందుకు బరిలో దింపలేదని ప్రశ్నించారు. జల్‌పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేస్తే.... విత్​డ్రా చేయించారని ఆరోపించారు. నల్గొండ నగరపాలక సంస్థలోని 26వ డివిజన్‌లో కాంగ్రెస్ కౌన్సిలర్ మరణిస్తే అక్కడ ఎందుకు ఏకగ్రీవం చేయలేదన్నారు. ఎంఐఎం, భాజపాలను తెరాస సమన్వయం చేస్తోందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు బండి సంజయ్ అనుకూలంగా వ్యవహరించారని కిషన్​ రెడ్డి వర్గం కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మినీ పోల్స్: సామాజిక మాధ్యమాల వేదికగా.. భాజపా విస్తృత ప్రచారం

ABOUT THE AUTHOR

...view details