తెలంగాణ

telangana

'కరోనా నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం'

By

Published : Apr 3, 2021, 5:50 PM IST

కరోనా నివారణకు మాస్క్​ వినియోగం తప్పనిసరి చేయటం మినహా ప్రభుత్వం ఏమి చేయలేదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. కొవిడ్​ నివారణకు చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైందని ఆయన విమర్శించారు.

congress mlc jeevan reddy
'కరోనా నివారణకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం'

కరోనా నివారణకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నా... వచ్చే రెండు వారాల్లో పతాక స్థాయికి కేసుల సంఖ్య చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్ వినియోగం తప్పనిసరి చేయటం మినహా... సర్కార్‌ ఏమి చేయలేదని ఆరోపించారు. విద్యాసంస్థలు మూసేసినా, జనసమూహాలను నిలువరించేందుకు సినిమా హాల్స్​ గురించి ఆలోచన చేయడం లేదని ఆరోపించారు. సినీ నిర్మాతల పరిస్థితి ఆలోచిస్తుంది కానీ...జనం ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

బార్లు, పబ్బులు, క్లబ్​ల గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే మద్యం దుకాణాలు మూసేయడానికి మనసు రావడం లేదన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ముందస్తుగా అప్రమత్తమై అనుమానంతో వచ్చేవారికి సకాలంలో పరీక్షలు, నిర్ధరణ అయితే క్వారంటైన్‌లో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

'కరోనా నివారణకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం'

ఇదీ చదవండి:యాదాద్రిపై కరోనా ప్రభావం.. భారీగా తగ్గిన ఆదాయం

ABOUT THE AUTHOR

...view details