తెలంగాణ

telangana

'పంజాబ్ రైతులపై ఎందుకంత ప్రేమ... పార్థసారథి రెడ్డి ఎపిసోడ్‌ ఆపేదేలే'

By

Published : May 24, 2022, 7:41 PM IST

Updated : May 24, 2022, 8:03 PM IST

Jaggareddy Comments On KCR: తెలంగాణ రైతుల మీద లేని ప్రేమ కేసీఆర్​కు పంజాబ్ రైతుల మీద ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెరాస, భాజపా, ఎంఐఎం మధ్య రాజకీయ సంబంధం కుదిరిందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లయినా రాష్ట్రంలో రూ. లక్ష రుణ మాఫీ చేయలేదని మండిపడ్డారు.

jaggareddy fires on kcr
కేసీఆర్​పై జగ్గారెడ్డి ఫైర్

పంజాబ్ రైతులపై ఎందుకంత ప్రేమ: జగ్గారెడ్డి

Jaggareddy Comments On KCR: కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉచిత కరెంట్ ఇస్తే దాన్నే తెరాస కొనసాగిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాగానే మొదటి సంతకం ఉచిత విద్యుత్‌ ఫైల్‌ మీద పెట్టారని గుర్తు చేశారు. తెరాస నేతలు పదేపదే కాంగ్రెస్‌ ఏం చేసిందని అడుగుతున్నారని... రూ. లక్ష రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లయినా సీఎం కేసీఆర్ రూ. లక్ష మాఫీ చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్ గాంధీభవన్​లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ తీరుపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రైతుల మీద కేసీఆర్ సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పంజాబ్‌ రైతుల వద్దకు వెళ్లిన కేసీఆర్‌.. ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఇంటికి కూడా వెళ్లలేదని ధ్వజమెత్తారు. ఓట్లేసిన రైతుల పరామర్శకు వెళ్లని కేసీఆర్​.. పంజాబ్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తెరాస, భాజపా, ఎంఐఎం మధ్య రాజకీయ సంబంధం కుదిరిందని ఎద్దేవా చేశారు. తెరాస వ్యతిరేక ఓట్లు చీల్చి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. రెమ్​డిసివిర్​పై ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయని.. పార్థ సారథి ఎపిసోడ్ ఆపేది లేదని జగ్గారెడ్డి అన్నారు. దానం నాగేందర్ ఏదేదో మాట్లాడారని.. నాగేందర్ ప్రశ్నకు అనేక అనుమానాలు వచ్చాయని.. వాటి మీద కూడా స్పందిస్తాన్నారు. పార్థసారథి రెడ్డి ఎపిసోడ్‌ ఆపేదిలేదని.. మరికొద్ది రోజుల్లో అన్ని విషయాలు బయటపెడతానని స్పష్టం చేశారు.

'రాజకీయాల కోసమే కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారనేది నిజం కాదా?. రైతులు మరణిస్తే పరిహారం ఇస్తున్నారు కానీ.. బతకడానికి సాయం అందించరా?. బతకడానికి బీమా ఇవ్వాలి కానీ.. చనిపోతే బీమా ఇస్తాం అంటే ఎలా? పంటల బీమా పథకం ఎందుకు పెట్టలేదు? ఉద్యోగుల సమ్మె అంటే ప్రభుత్వం భయపడుతుంది కానీ.. రైతుల ఉద్యమాలకు మాత్రం భయపడటం లేదు. ఆర్ధిక ఇబ్బందులతో రైతు చనిపోయే పరిస్థితి రాకుండా చూడాలి. పంజాబ్​లో ఆప్.. హరియాణాలో భాజపా ప్రభుత్వం ఉన్న చోటుకి... కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం ఏముంది'?-జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:Traffic Restrictions In PM Tour: ప్రధాని మోదీ హైదరాబాద్​ పర్యటన.. ట్రాఫిక్​ ఆంక్షలివే..

గోల్డ్​లోన్​ వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎలా ఉన్నాయంటే..

Last Updated : May 24, 2022, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details