తెలంగాణ

telangana

పోలింగ్ కేంద్రంలో మాస్క్‌ రగడ..భాజపా, తెరాస శ్రేణుల మధ్య గొడవ

By

Published : Dec 1, 2020, 12:33 PM IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బంజారాహిల్స్‌ ఎన్జీటీనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గులాబీ, కాషాయ మాస్కులు ధరించారని ఇరు వర్గాల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు.

conflict-between-bjp-and-trs-political-parties-due-to-mask-colour
మాస్క్‌ రగడ: భాజపా, తెరాస శ్రేణుల మధ్య వాగ్వాదం

బంజారాహిల్స్‌ ఎన్జీటీనగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భాజపా కార్యకర్తలు కాషాయ మాస్కులు ధరించారని తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. తెరాస కార్యకర్తలు చేతులకు గులాబీ కంకణాలు కట్టుకున్నారని భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల వారినీ చెదరగొట్టారు. దీంతో ఎన్జీటీ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది.

గులాబీ మాస్కులపై కాంగ్రెస్‌ అభ్యంతరం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల్లో తెరాస ఏజెంట్లు గులాబీ రంగు మాస్కులు ధరించడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి పీసీసీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌ నిరంజన్‌ ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న అధికారులు

ABOUT THE AUTHOR

...view details