తెలంగాణ

telangana

కర్ణాటక ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల పరిహారం

By

Published : Jun 3, 2022, 4:09 PM IST

Updated : Jun 3, 2022, 4:33 PM IST

Road Accident in Karnataka: కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ వాసుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఎక్స్​గ్రేషియాను, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. అటు.. కర్ణాటక రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.

కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

Road Accident in Karnataka: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి... తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్ణాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని క్షతగాత్రులైన వారికి సరైన వైద్యం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఎక్స్​గ్రేషియాను, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్​కుమార్​ను సీఎం ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పార్థివ దేహాలను వారి స్వస్థలానికి తరలించడం, క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావును, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డుప్రమాదంపై మంత్రి కేటీఆర్​ కూడా విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై కర్ణాటక అధికారులతో కేటీఆర్​ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల​ ఆదేశాలతో కర్ణాటక నుంచి మృతదేహాలు తరలింపునకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్​కుమార్​ సంగారెడ్డి కలెక్టర్​ను ఆదేశించారు.

విచారం వ్యక్తం చేసిన మంత్రి తలసాని: కర్ణాటక రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక కలబురిగి జిల్లా కమలాపుర వద్ద సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధిత కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందే విధంగా ప్రభుత్వం తరపున చర్యలు చేపడతామని చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి తలసాని భరోసా ఇచ్చారు.

బండి సంజయ్​ దిగ్భ్రాంతి: రోడ్డుప్రమాదంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కర్ణాటక రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను కంటోన్మెంట్​ ఎమ్మెల్యే సాయన్న పరామర్శించారు. రోడ్డుప్రమాదంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఘటనకు ముందు సరదాగా గడిపారు.. కానీ విధి వారిని వంచించింది..

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కలబురిగి జిల్లా కమలాపురలో గూడ్స్‌ లారీని ప్రైవేట్​ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ బస్సు బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ గుంతలో బోల్తా పడింది. ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో బస్సు కాలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతులు, క్షతగాత్రులను హైదరాబాద్‌ బొల్లారంలోని రిసాలబజార్‌కు చెందిన వారిగా గుర్తించారు.

ప్రమాదానికి ముందు గోవాలోని సముద్ర తీరంలో ఇలా..
కుటుంబంతో సరదాగా..

ఇవీ చదవండి:

Last Updated :Jun 3, 2022, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details