తెలంగాణ

telangana

రాంచీలో కేసీఆర్ పర్యటన.. ఝార్ఖండ్​ ముఖ్యమంత్రితో భేటీ..

By

Published : Mar 4, 2022, 2:11 PM IST

Updated : Mar 4, 2022, 3:06 PM IST

KCR jharkhand Tour : ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. గిరిజన ఉదయ నేత బిర్సా ముండా విగ్రహానికి తొలుత కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం ఝార్ఖండ్ సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. జాతీయ రాజకీయాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు.

KCR jharkhand Tour, kcr hemant soren
రాంచీలో కేసీఆర్ పర్యటన

రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటన

KCR jharkhand Tour : ఝర్ఖండ్‌ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. తొలుత గిరిజన ఉదయ నేత బిర్సా ముండా విగ్రహానికి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం ఝార్ఖండ్ సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత బృందాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. శిబు సొరేన్​కు జ్ఞాపికను ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. గతంలో యూపీఏ హయాంలో ఇద్దరూ కేంద్రమంత్రులుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శిబు సొరేన్​తో కేసీఆర్​కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అతని కుమారుడు ఝార్ఘండ్ సీఎం హేమంత్ సొరేన్​తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, భాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు.

ఝార్ఖండ్‌ సీఎంతో కేసీఆర్ బృందం భేటీ

కేసీఆర్​కు అపూర్వస్వాగతం

KCR about Galwan martyrs : ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. బంగారు తెలంగాణ నిర్మాత , జాతీయ ఫెడరల్ నేత అంటూ కేసీఆర్‌కు ఝార్ఖండ్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాంచీ విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్ నేరుగా బిర్సా ముండా చౌక్‌కు చేరుకుని అక్కడ అన్న గిరిజన ఉద్యమ నేతకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చ

అమరజవాన్లకు ఆర్థిక సాయం

గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాట మేరకు.. వారికి సాయం అందించారు. ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను సోరేన్‌తో కలిసి కేసీఆర్ అందజేశారు. గల్వాన్ లోయలో అమరుడైన జవాను కుందన్‌కుమార్‌ ఓజా భార్య నమ్రతకు చెక్కును అందజేశారు. మరో వీర జవాన్ గణేశ్ కుటుంసభ్యులకు రూ.10 లక్షల చెక్కును ఇచ్చారు. ఈ సందర్భంగా వారు కంటతడి పెట్టుకున్నారు. అమరులైన జవాన్లను గుర్తు చేసుకొని వారి కుటుంబసభ్యులు బోరున విలపించారు. చలించిన సీఎం కేసీఆర్... వారిని ఓదార్చారు. అన్నిరకాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు. చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన కర్నల్ సంతోశ్ బాబు కుటుంబాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్ అప్పుడు ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. ఈమేరకు ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు శుక్రవారం సాయం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత మిగిలిన ప్రాంతాల్లో ప్రకటించి.. ఆయా రాష్ట్రాల అమర జవాన్ల కుటుంబాలకు కూడా సాయం అందించనున్నారు.

అమర జవాన్ల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

కేసీఆర్ పేరిట భారీ కటౌట్లు
కేసీఆర్ పేరిట భారీ కటౌట్లు

KCR Cutouts in Ranchi : తెలంగాణ సీఎం పర్యటన నేపథ్యంలో రాంచీ నగరంలో పలు చోట్ల కేసీఆర్ పేరిట బ్యానర్లు, కటౌట్లు దర్శనమిచ్చాయి. 'దేశ్ కీ నేత కేసీఆర్' అనే నినాదాలు కలిగిన కటౌట్లతో రాంచీ నగరంలోని వీధులు గులాబీమయమయ్యాయి. గతంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారం సమయంలోనూ.. దేశ్ కీ నేత కేసీఆర్ అనే బ్యానర్లు, కటౌట్లు కనిపించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాంచీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాంచీ చేరుకున్నారు. గల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తారని తెలిపారు. అనంతరం ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో భేటీ అవుతారని వెల్లడించారు. ఝార్ఖండ్-తెలంగాణ దగ్గరి సారూప్యం కలిగిన రాష్ట్రాలని అభివర్ణించారు.


ఇదీ చదవండి:శ్రీనివాస్​గౌడ్​ హత్య కుట్ర కేసు.. రిమాండ్​ రిపోర్టులో ఆసక్తికర విషయాలు

Last Updated : Mar 4, 2022, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details