తెలంగాణ

telangana

ప్రగతి భవన్‌లో అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్

By

Published : Oct 19, 2022, 4:21 PM IST

Updated : Oct 19, 2022, 5:32 PM IST

kcr
kcr

16:16 October 19

ప్రగతి భవన్‌లో అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్

CM KCR meeting with officials in Pragati Bhavan: గత ఎనిమిది రోజులుగా దిల్లీలో ముఖ్యనేతలతో జాతీయ రాజకీయల కోసం విసృతంగా చర్చలు.. బీఆర్‌ఎస్‌ కార్యాలయ ఏర్పాటు కోసం ముఖ్యనేతలతో బిజీబిజీగా గడిపిన కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. కేసీఆర్‌ హస్తిన పర్యటన ముగించిన వెంటనే నేరుగా హైదరాబాద్ చేరుకొని అధికారులతో సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్రలతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులు గురించి ఆరాతీశారు.

ములాయంసింగ్​ యాదవ్​ అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్​ వెళ్లిన సీఎం.. అక్కడి నుంచి నేరుగా దిల్లీ వెళ్లారు. భారత్​ రాష్ట్ర సమితి ప్రకటన తర్వాత తొలిసారి దిల్లీ వెళ్లిన కేసీఆర్​.. బీఆర్​ఎస్​ కోసం సిద్ధమవుతున్న కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో చేయవలసిన మార్పుల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ ఎనిమిది రోజులు దిల్లీలోనే ఉన్న కేసీఆర్​ జాతీయ రాజకీయాలపై కొందరి ముఖ్య నేతలతో సంభాషించి, చర్చించారు. అనంతరం సీఎం స్వల్ప అస్వస్తతకు గురయ్యారు.. అక్కడే ఉంటూ చికిత్స తీసుకున్నారు. నిన్న హస్తినలోనే రాష్ట్ర ముఖ్య అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు చేరుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 19, 2022, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details