తెలంగాణ

telangana

Cm Kcr Speech: 'రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతాం'

By

Published : Oct 7, 2021, 4:23 PM IST

కేంద్రంపై మండిపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr ). అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఆయన కేంద్రంలో (Cm Kcr Speech) ఏ ప్రభుత్వం ఉన్నా పథకాల పేర్లు మాత్రమే మారుస్తారని వైఖరి మాత్రం మారదని దుయ్యబట్టారు. రాష్ట్రాల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతామన్నారు.

Cm Kcr Speech
ముఖ్యమంత్రి కేసీఆర్

గతంలో గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేదని సీఎం కేసీఆర్ (Cm Kcr Speech) అన్నారు. ఏ ఊరికి వెళ్లినా... ఎమ్మెల్యేల ముందు బిందెలతో నిరసనలు జరిగేవని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. నిధుల కోసం గ్రామపంచాయతీ ఆస్తులను తాకట్టు పెట్టుకొమ్మని కేంద్రం చెప్తోందని సూచించారు. తెలంగాణ ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రమని పార్లమెంటులో కేంద్రమే చెప్పిందని సీఎం స్పష్టం చేశారు.

350 బస్తీ దవాఖనాలు ఏర్పాటు చేయాలని చెప్పినట్లు సీఎం వివరించారు. త్వరలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు పల్లెల్లోనే వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు పెంచుతామని పేర్కొన్నారు.

అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. కేంద్రానికి అధిక ఆదాయం సమకూరుస్తున్న 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. రాష్ట్ర జాబితాలోని అనే అంశాలను కేంద్ర జాబితాలో చేర్చారు. కాంగ్రెస్‌, భాజపా ప్రభుత్వాలు రాష్ట్రాల అధికారాలను తగ్గించాయి. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామంటే భాజపా పాలిత రాష్ట్రాలు వ్యతిరేకించాయి. పెట్రోల్‌, డీజిల్‌పై వచ్చే ఆదాయం కూడా రాకుండా చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. రాష్ట్రాల హక్కుల కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతాం. పట్టణ, స్థానిక సంస్థలకు కలిపి ప్రతి నెల రూ.227 కోట్లు ఇస్తున్నాం. గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రతినెల క్రమం తప్పకుండా రూ.112 కోట్లు విడుదల చేస్తాం.

-- అసెంబ్లీలో సీఎం కేసీఆర్

ఇదీ చూడండి:Cm Kcr Speech In Assembly: 'ఊరికొక పంచాయతీ కార్యదర్శి ఏ రాష్ట్రంలోనూ లేరు'

ABOUT THE AUTHOR

...view details