తెలంగాణ

telangana

ఎఫ్‌ఆర్‌వో మృతిపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి.. రూ.50 లక్షల పరిహారం ప్రకటన

By

Published : Nov 22, 2022, 6:25 PM IST

Updated : Nov 22, 2022, 6:43 PM IST

CM KCR announced a compensation of 50 lakh rupees to the FRO srinivas family
ఎఫ్‌ఆర్‌వో మృతిపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి ()

CM KCR on FRO srinivas గుత్తికోయల దాడిలో ఎఫ్‌ఆర్‌వో మృతిపట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.

CM KCR on FRO srinivas గుత్తికోయల దాడిలో మరణించిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. అట‌వీ ఆక్రమ‌ణ‌ల‌ు స‌హించేది లేద‌న్న సీఎం... అక్రమణదారులపై చట్టప‌రమైన చ‌ర్యలు తీసుకుంటామన్నారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం... దోషులకు కఠినంగా శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. మరణించిన ఎఫ్‌ఆర్‌ఓ కుటుంబానికి 50 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి... డ్యూటీలో ఉన్నప్పుడు శ్రీనివాసరావుకు అందే జీతభత్యాలన్నీ పదవీవిరమణ వయస్సు వచ్చేదాకా ఆయన కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. శ్రీనివాసరావు పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. అంత్యక్రియల్లో పాల్గొనాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌ను సీఎం ఆదేశించారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి జంకు లేకుండా విధులు నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి:

Last Updated :Nov 22, 2022, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details