తెలంగాణ

telangana

లాక్​డౌన్​ 2.0: రవాణా శాఖ స్లాట్ల బదలాయింపు

By

Published : May 13, 2021, 9:57 AM IST

కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ విధించటంతో వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సులకు బ్రేకులు పడ్డాయి. ముందస్తుగా తీసుకున్న సమయాల(స్లాట్ల)ను రవాణా శాఖ వాయిదా వేసింది.

change-of-department-of-transportation-slots
రవాణా శాఖ స్లాట్ల బదలాయింపు

రవాణా శాఖ రోజూ రాష్ట్రవ్యాప్తంగా అయిదారు వేలకుపైగా స్లాట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. వాహన, లైసెన్సుదారులు నిర్దేశించిన సమయాలకు ఆయా రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లి ప్రక్రియను పూర్తి చేస్తారు. బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించినప్పటికీ 33 శాతం మంది సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు పని చేయాలని ఉత్తర్వులు జారీ చేయటంతో రోజు వారీగా కేటాయించే సమయాలను తగ్గించాలని తొలుత అధికారులు భావించారు.

అయితే లాక్‌డౌన్‌ వెసులుబాటు సమయం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకే ఉండటం, ఆ సమయంలో కార్యాలయాలు పని చేసేందుకు అవకాశం లేకపోవటంతో అన్నిటినీ వాయిదా వేయాలని అధికారులు బుధవారం నిర్ణయించారు. ఇప్పటికే తీసుకున్న స్లాట్లను లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత రోజు నుంచి ఆయా సమయాల మేరకు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ రోజులకు సంబంధించిన స్లాట్లను నిలుపుదల చేయాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి:కూలీల కొరతతో సన్నకారు రైతుల సతమతం

ABOUT THE AUTHOR

...view details