తెలంగాణ

telangana

ఖమ్మం బహిరంగ సభకు చంద్రబాబు.. అడుగడుగునా కార్యకర్తల నీరాజనం

By

Published : Dec 21, 2022, 12:41 PM IST

Updated : Dec 21, 2022, 12:56 PM IST

Chandrababu Rally to Khammam : ఖమ్మంలో టీడీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్​లోని తన నివాసం నుంచి బయల్దేరారు. మొదట రసూల్​పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరారు.

Chandrababu
Chandrababu

Chandrababu Rally to Khammam : పార్టీకి పూర్వవైభవంతోపాటు శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం శంఖారావం పేరుతో.. ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుంది. ఈ సభలో పాల్గొనేందుకు పార్టీ అధినేత చంద్రబాబు.. హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. శ్రేణులతో కలిసి ఖమ్మం బయల్దేరిన ఆయన మార్గమధ్యలో బేగంపేట వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరారు. ఉప్పల్ కూడలి వద్ద చంద్రబాబుకు నేతలు ఘనస్వాగతం పలికారు. వనస్థలిపురంలో గజమాలతో టీడీపీ శ్రేణలు సత్కరించారు.

తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలుస్వీకరించిన తర్వాత.. నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో ఖమ్మం నగరమంతా జెండాలు, హోర్డింగ్​లు, ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారింది. ఉమ్మడి ఖమ్మం సహా రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలను పసుపు చీరలు ధరించి సభలో పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు.

ఖమ్మం బహిరంగ సభకు చంద్రబాబు.. అడుగడుగునా కార్యకర్తల నీరాజనం
Last Updated : Dec 21, 2022, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details