తెలంగాణ

telangana

ముస్లింలకు ఆ పథకాలు టీడీపీ అమలు చేస్తే.. వైసీపీ రద్దు చేసింది: చంద్రబాబు

By

Published : Dec 9, 2022, 4:38 PM IST

CHANDRABABU FIRES ON YCP GOVERNMENT: ముస్లింలకు రంజాన్ తోఫా, వివాహాలకు దుల్హన్ ద్వారా ఆర్థికసాయం చేసినది టీడీపీ ప్రభుత్వమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

chandrababu
చంద్రబాబు నాయుడు

CBN FIRES ON CM JAGAN: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరులో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చిన ప్రభుత్వం తమదని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలో మతకలహాలు రూపు మాపింది టీడీపీ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ముస్లిం పిల్లల వివాహాలకు దుల్హన్ ద్వారా ఆర్థికసాయం చేశామన్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలన్నీ రద్దు చేసిందని మండిపడ్డారు.

దుల్హన్ పథకానికి అడ్డగోలు నిబంధనలు పెట్టి దూరం చేసిందని.. తాము అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం మళ్లీ అమలు చేస్తామని పేర్కొన్నారు. మైనార్టీ పిల్లలకు విదేశీ విద్యా దీవెన అమలు చేశామన్న బాబు.. ప్రపంచంలో మంచి వర్శిటీలో చదువుకునే అవకాశం కల్పించామన్నారు. పోటీ ప్రపంచంలో వారు నిలబడేలా అండగా ఉన్నామని తెలిపారు.

హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చేసినట్లు తెలిపారు. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని.. ముస్లిం అమ్మాయిలు చదువుకుని అబ్బాయిలకు పోటీగా ఉద్యోగాలు సాధించారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ పిల్లల చదువులకు రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలెడ్జ్ ఎకానమీలో ముస్లింలు కూడా ముందుండేలా కృషిచేసినట్లు చంద్రబాబు తెలిపారు.

అప్పుడే రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది: తెలుగుదేశం అధికారంలో కొనసాగి ఉంటే 2020 జూన్‌ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు.. రాబోయే ఎన్నికల్లో ఎలా పని చేయాలో దిశానిర్దేశం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను కాదని ఎన్నికల కోసం జగన్ కొత్త వారిని తీసుకుంటున్న విషయాన్ని.. కార్యకర్తల భేటీలో ప్రస్తావించారు. తెలుగుదేశం కార్యకర్తలు మరింత కసి, పట్టుదలతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అప్పుడే రాష్ట్రానికి పట్టిన వైకాపా శని వదులుతుందని వ్యాఖ్యానించారు.

ముస్లింలకు ఆ పథకాలు టీడీపీ అమలు చేస్తే.. వైసీపీ రద్దు చేసింది

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details