తెలంగాణ

telangana

KISHAN REDDY: దశలవారీగా వ్యాక్సిన్​ అందరికి అందుతుంది

By

Published : Jun 6, 2021, 8:57 PM IST

దశలవారీగా అందరికి వ్యాక్సిన్​ అందుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ సీతాఫల్​మండిలోని మల్టీపర్పస్​ ఫంక్షన్​హాల్​లో సూపర్​ స్ప్రెడర్స్​కు జరుగుతున్న వ్యాక్సినేషన్​ను మంత్రి పరిశీలించారు. అనతికాలంలోనే వ్యాక్సిన్ ప్రజలందరికీ అందించి ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి భారత్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు

KISHAN REDDY
దశలవారీగా వ్యాక్సిన్​ అందరికి అందుతుంది

మంచి జరిగితే తమ ముఖ్యమంత్రి గొప్పతనంగా, చెడు జరిగితే ప్రధాని మోదీ మీద నెట్టివేయడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ సీతాఫల్​మండిలోని మల్టీపర్పస్​ ఫంక్షన్​హాల్​లో సూపర్​ స్ప్రెడర్స్​కు జరుగుతున్న వ్యాక్సినేషన్​ను మంత్రి పరిశీలించారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుతెన్నుల గురించి అధికారులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలను రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాల్సిన సమయమని ఆయన అన్నారు. దయచేసి కొవిడ్​ విషయంలో రాజకీయాలు చేయొద్దని.. రాష్ట్రప్రజలను అందరం కలిసి ఆదుకుందామని కోరారు.

ఇప్పటికే అనేక మంది నేతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అనేక సహాయకార్యక్రమాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. దశలవారీగా అందరికి వ్యాక్సిన్ అందుతుందని, అనతికాలంలోనే వ్యాక్సిన్ ప్రజలందరికీ అందించి ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి భారత్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వ్యాక్సిన్​ను రెండు సంస్థలు అందిస్తున్నాయని, అనేక సంస్థలతో వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. అతి త్వరలో అవి కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.. అంతేకాకుండా 18ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

ఇదీ చదవండి:CS: కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: సీఎస్‌

ABOUT THE AUTHOR

...view details