తెలంగాణ

telangana

వివేకా హత్య కేసు.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు

By

Published : Jan 23, 2023, 10:55 PM IST

CBI Officials Notices to Kadapa MP Avinash Reddy: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. పులివెందులలో అవినాష్‌ రెడ్డి పీఏకు సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.

avinashreddy
avinashreddy

CBI Officials Notices to Kadapa MP Avinash Reddy: ఏపీలోని కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. పులివెందులలో అవినాష్‌ రెడ్డి పీఏకు సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందిస్తూ.. వైఎస్‌ అవినాష్ రెడ్డి లేఖ ద్వారా సీబీఐ అధికారులకు సమాధానం ఇచ్చారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు.

మంగళవారం పులివెందులలో బిజీ షెడ్యూల్‌ ఉన్నందున విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నారు. మరోసారి విచారణ తేదీ తెలియజేయాలని లేఖలో కోరారు. ఐదు రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని అవినాష్‌రెడ్డి తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఇవాళ కడప నుంచి పులివెందులకు వెళ్లిన విషయం తెలిసిందే. పులివెందుల వైకాపా కార్యాలయానికి వెళ్లిన అధికారులు.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి గురించి ఆరా తీశారు. భాస్కర్‌రెడ్డి కార్యాలయానికి రాలేదని పార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారు వెనుదిరిగారు. అనంతరం పార్టీ కార్యాలయం సమీపంలోనే ఉన్న వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఇంటి పరిసరాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details