తెలంగాణ

telangana

పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

By

Published : Nov 13, 2020, 6:43 PM IST

Updated : Nov 13, 2020, 7:22 PM IST

cabinet-meeting-in-pragati-bhavan
పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

18:40 November 13

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

సీఎం కేసీఆర్​ అధ్యక్షతన ప్రగతిభవన్​లో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ శాసనమండలిలో రాష్ట్ర గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

గవర్నర్‌ కోటా కింద ఖాళీ అయిన మూడు స్థానాలకు ప్రముఖ ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముగ్గురు పేర్లతో ఖరారు చేసిన జాబితాను గవర్నర్‌ ఆమోదానికి పంపించారు. వీటితో పాటు సాదాబైనామా క్రమబద్ధీకరణపై చట్టసవరణతో పాటు గ్రేటర్ ఎన్నికలు, సన్నాలకు మద్దతు ధర, బోనస్​పై కూడా చర్చించినట్లు సమాచారం.

ఇవీ చూడండి: గవర్నర్​ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి పేర్లు ఖరారు

Last Updated :Nov 13, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details