తెలంగాణ

telangana

'ఏసీబీ వలలో రవాణా శాఖ చేప'

By

Published : Feb 11, 2020, 9:10 PM IST

ఖైరతాబాద్‌ పరిపాలన విభాగం అధికారి నరేందర్‌ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కాడు. ఏకంగా రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయంలోనే సదరు అధికారి లంచం తీసుకోవడం విడ్డూరం.

ACB_Trap
ACB_Trap

అవినీతి నిరోధక శాఖ వలకు పెద్ద చేప చిక్కింది. ఖైరతాబాద్‌ పరిపాలన విభాగం అధికారిగా పనిచేస్తున్న నరేందర్‌... సంగారెడ్డికి చెందిన సందీప్‌ అనే వ్యక్తి నుంచి 36 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. హైదరాబాద్​ సోమాజిగూడ డా.బిఆర్​ అంబేడ్కర్​ రవాణా శాఖ భవన్​లోని​ కమిషనర్‌ కార్యాలయంలోనే సదరు అధికారి లంచం తీసుకుంటూ అధికారులకు దొరకడం విడ్డూరం.

నీటి ట్యాంకర్ల తయారీ అనుమతి కోసం ఈ డబ్బు డిమాండ్​ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంతకుముందే 30 వేల రూపాయల లంచం తీసుకున్న నరేందర్​... మరోసారి లంచం అడగటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడని చెప్పారు. ఇతను 2016లో 8 వేల రూపాయలు లంచం స్వీకరిస్తూ అనిశాకు దొరికాడు. మరో వైపు ఇతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నడుస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా దొరికిన అధికారి

ఇవీ చూడండి: అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం : సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details