తెలంగాణ

telangana

bandi sanjay letter to kcr: మంత్రివర్గంలో వారికి అవకాశమివ్వాల్సిందే.. కేసీఆర్​కు బండి సంజయ్ లేఖ

By

Published : Sep 26, 2021, 10:07 AM IST

Updated : Sep 26, 2021, 10:38 AM IST

bjp-telangana-state-president-bandi-sanjay-letter-to-cm-kcr-on-bc-bandhu
bjp-telangana-state-president-bandi-sanjay-letter-to-cm-kcr-on-bc-bandhu

09:34 September 26

మంత్రివర్గంలో 8 మంది బీసీలకు స్థానం కల్పించాలి: బండి సంజయ్​

 బీసీల‌ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు (bandi sanjay letter to cm kcr). బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు (bc bandhu). మంత్రివర్గంలో 8మంది బీసీలకు స్థానం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బీసీ కుంటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. జనాభాలో 50శాతానికిపైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీబంధు పథకం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలపై తెరాస ప్రభుత్వం సవతితల్లి ప్రేమను విడాలన్నారు.

  తెరాస ప్రభుత్వహయంలో బీసీసబ్​ప్లాన్ (bc sub plan) అటకెక్కిందని మండిపడ్డారు. బీసీ సబ్​ప్లాన్​కు చట్ట భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 46 బీసీ  కులాలకు నిర్మిస్తామన్న ఆత్మగౌరవ భవనాల అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నించారు. రూ.3,400 కోట్ల ఫీజురీయింబర్సుమెంట్ బకాయిలను వెంటనే  విడుదల చేయాలన్నారు. చేనేత కార్మికులకు భీమా, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులను ఆదుకోవడంతో పాటు.. రజకుల‌ కోసం దోబీ ఘాట్​లను నిర్మించాలన్నారు. నాయి బ్రాహ్మణులకు 200యూనిట్ల విద్యుత్​ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఎంబీసీ కార్పొరేషన్​కు సమృద్ధిగా నిధులు కేటాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. 

Last Updated :Sep 26, 2021, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details