తెలంగాణ

telangana

తెరాస పాలనలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం: బండి సంజయ్

By

Published : Aug 12, 2022, 1:02 PM IST

Updated : Aug 12, 2022, 3:43 PM IST

బండి సంజయ్
బండి సంజయ్

Bandi Sanjay Letter To Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు కేటాయించిన నిధులను రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెరాస ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

Bandi Sanjay Letter To Kcr: డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు కేటాయించిన నిధులను రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. సెర్ఫ్‌, మెప్మా, ఎస్​జీహెచ్​లకు చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. తెరాస ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని బండి విమర్శించారు.

2021-22 బడ్జెట్‌లో మహిళా గ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు రూ.3 వేల కోట్లు కేటాయించారని బండి సంజయ్ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1250 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదన్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుందనే ఆశతో మహిళలు ఎదురుచూస్తున్నారని.. ప్రభుత్వ నిర్వాకంతో రుణాలు తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:Eamcet Results: ఎంసెట్ ఫలితాలు విడుదల.. త్వరలోనే కౌన్సెలింగ్‌ ప్రారంభం

ప్రగతి పథంలో ప్రజా రథం.. 75 ఏళ్ల అభివృద్ధి యజ్ఞం

Last Updated :Aug 12, 2022, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details