తెలంగాణ

telangana

'సొంత పార్టీ ఎంపీని అరెస్టు చేయడం వెనుక మీ ఉద్దేశం ఏంటి'

By

Published : May 14, 2021, 10:51 PM IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై ఏపీ భాజపా నేత సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే రఘురామను అరెస్టు చేయించారని ఆరోపించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టకుండా నేతలను అరెస్టు చేయడం తగదని వ్యాఖ్యానించారు.

ap news
ఏపీ వార్తలు

ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని అదే పార్టీకి చెందిన ఎంపీని అరెస్టు చేయడం ఏంటని భాజపా నేత వై.సత్యకుమార్ ప్రశ్నించారు. ఈ ఘటనతో సొంత పార్టీ అసమ్మతి నేతలను హెచ్చరిస్తున్నారా అని నిలదీశారు. ఇసుక, మద్యం టెండర్ల అవినీతిని ప్రశ్నిస్తే... ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు, కరోనా కేసులు పెరుగుతున్నప్పుడు సంగం డెయిరీ అరెస్టులు, పడకలు దొరకక, ఆక్సిజన్ అందక రోగులు అవస్థలు పడుతున్న సందర్భాల్లో పాస్టర్ల, మౌల్విల జీతాల పెంపు వంటి అంశాలతో ప్రజల దృష్టి మరల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా... జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు సూచిస్తున్నా... ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపడం ఏంటని సత్యకుమార్ ప్రశ్నించారు.

ఇదీచదవండి:కొరత లేనప్పుడు ఇంతమంది ఎలా చనిపోతున్నారు: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details