తెలంగాణ

telangana

Bathukamma Celebrations In Telangana : పూల జాతర బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మ

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2023, 8:32 AM IST

Updated : Oct 19, 2023, 9:59 AM IST

Bathukamma Celebrations In Telangana : తెలంగాణ అస్థిత్వ ప్రతీక.. తీరొక్క పూలతో అందంగ పేర్చి ఆడబిడ్డలంతా ఆనందంగా ఆడిపాడుకునే బతుకమ్మ పండుగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగుతోంది. సంప్రదాయ నృత్యాలు, కోలాటాలతో మహిళలంతా ఓ చోట చేరి ఐదో రోజు అట్ల బతుకమ్మను నిర్వహించారు. పిల్లాపాపలు సల్లగ బతికి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గౌరమ్మను వేడుకున్నారు.

Atla Bathukamma Celebrations 2023
Bathukamma Celebrations In Telangana

Bathukamma Celebrations In Telangana పూల జాతర బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మ

Bathukamma Celebrations In Telangana 2023 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మను హైదరాబాద్‌ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించిన సంబురాలలో పాల్గొన్న బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి బతుకమ్మమహిళల అస్థిత్వానికి ప్రతీకగా నిలిచిందని వెల్లడించారు. నాంపల్లిలోని టీజీఓ భవన్‌లోని మహిళా అధికారులు బతుకమ్మల చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మణికొండలో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రకాశ్‌ పాల్గొని అతివలతో కలిసి కాలు కదిపారు.

MLC Kavitha Bathukamma Video : బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత.. తోటి మహిళలతో కలిసి ఆటాపాట

MLC Kavitha At Bathukamma Celebrations: తెలంగాణలో బతుకమ్మను ఘనంగా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోందని ఎమ్మెల్యే కవిత వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో పలు కుల సంఘాల నాయకుల ఇంట్లో బతుకమ్మలు పేర్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో మహిళలు, యువతులు రంగు, రంగుల వస్త్రాలు ధరించి ఆనందంగా పండుగ జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో దుర్గామాత రూపంలో బతుకమ్మను ఆరాధించారు. జగిత్యాల జిల్లాలో ఎన్ఎస్వి కళాశాల విద్యార్థులు తయారు చేసిన భారీ బతుకమ్మకు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. మెట్‌పల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వెయ్యి మంది మహిళలు ఒక చోట చేరి బతుకమ్మ ఆడిపాడారు.

Bathukamma Celebrations At Telangana Secretariat : నూతన సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Bathukamma Celebrations Hyderabad 2023 : దేవుడికి పూజలో సమర్పించే పూలనే.. దైవంగా భావించి పూజించే విశిష్ఠ పండుగను వరంగల్‌ జిల్లాలో వైభవంగా నిర్వహించారు. వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాలలో సందడిగా వేడుక నిర్వహించిన విద్యార్థినులు తమకు బతుకమ్మ ఇష్టమైన పండుగగా అభివర్ణించారు. నర్సంపేటలో మాతృభూమి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంజీవని అనాధాశ్రమంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆశ్రమ నిర్వహకులు డాక్టర్‌ మోహన్‌రావు దంపతులు అన్ని ఏర్పాట్లు చేయగా వరంగల్ చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ బృందం పిల్లలతో కలిసి ఆడిపాడి వారిలో ధైర్యాన్ని నింపారు.

మహబూబాబాద్‌లోని ఎంపీ కవిత స్వగృహంలో జరిగిన వేడుకల్లో మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ దంపతులు, తదితర మహిళా ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు. ఐదో రోజు అట్లను నైవేద్యంగా పెట్టి బతుకమ్మ వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఖమ్మంలో మహిళలు సంతోషంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

Bathukamma Celebrations At Telangana Secretariat : నూతన సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Bathukamma celebrations in Ireland : ఐర్లాండ్​లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురం

Last Updated :Oct 19, 2023, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details