తెలంగాణ

telangana

విద్యుత్‌ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలి: బండి సంజయ్‌

By

Published : Jan 25, 2023, 1:20 PM IST

Bandi Sanjay Fires on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన హక్కులను సీఎం కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. వారు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియక అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. వెంటనే విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Fires on KCR: విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన హక్కులను ముఖ్యమంత్రి కేసీఆర్ కాలరాస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఏప్రిల్ 2022 నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీని ఇప్పటిదాకా ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. విద్యుత్ చరిత్రలో ఇన్నాళ్లు పీఆర్సీని ఆపిన పరిస్థితి లేదని.. విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అప్పు పుడితే తప్ప వాళ్లకు జీతాలివ్వలేని దుస్థితి:విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియక అయోమయంలో ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. గతంలో ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి అని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు 10వ తేదీ దాటిపోతోందని పేర్కొన్నారు. అప్పు పుడితే తప్ప వాళ్లకు జీతాలివ్వలేని దుస్థితి. రాష్ట్రంలో తయారైందని విమర్శించారు. పైగా ఏసీడీ వసూలు చేసుకోండి.. జీతాలు తీసుకోండి అని మౌఖికంగా చెప్పినట్లు తెలుస్తోందని బండి సంజయ్ అన్నారు.

ఏసీడీ బిల్లులకోసం వెళ్లిన ఉద్యోగులపై జనం తిరగబడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన తప్పిదాలకు.. ఉద్యోగులు బలయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి 25,000 మందికి పైగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను.. రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేశారని దుయ్యబట్టారు. ఖమ్మం బహిరంగ సభలో విద్యుత్ ఉద్యోగులను.. సీఎం రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని విమర్శించారు.

ఎన్ని మాయా మాటలు చెప్పినా వాళ్లు నమ్మే పరిస్థితుల్లో లేరు: విద్యుత్ సంస్థలకు, ఉద్యోగులకు, రాష్ట్రానికి చేసిన మోసం.. విద్యుత్ ఉద్యోగులకు స్పష్టంగా అర్థమైందన్నారు. ఎన్ని మాయా మాటలు చెప్పినా వాళ్లు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆరోపించారు. వారి న్యాయమైన డిమాండ్లు తీర్చకపోతే బీజేపీ ఉద్యమిస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.

జీఓ 317ను సవరించాల్సిందే:మరోవైపు ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనలపై బండి సంజయ్ స్పందించారు. జీఓ 317ను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఉత్తర్వులతో ఉపాధ్యాయులు, వారి కుటుంబసభ్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 34 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. గురువులు జీతాలు అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవో, ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీల అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

ఇవీ చదవండి:RRR టీమ్‌కు బండి సంజయ్ అభినందన.. రాహుల్ సిప్లిగంజ్‌ను కలిసి శుభాకాంక్షలు

'లఖింపుర్​ ఖేరీ' కేసులో కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్

ABOUT THE AUTHOR

...view details