తెలంగాణ

telangana

రాజకీయాల కోసమే పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ సీటు: బండి సంజయ్‌

By

Published : Feb 26, 2021, 3:49 PM IST

హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​, నల్గొండ-వరంగల్​-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల కోసమే పీవీ కుమార్తెకు తెరాస అధిష్ఠానం ఎమ్మెల్సీ సీటు కేటాయించిందని ఆయన ఆరోపించారు.

bandi sanjay
రాజకీయాల కోసమే పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ సీటు: బండి సంజయ్‌

రాజకీయ స్వార్థం కోసమే పీవీ నర్సింహారావు కుమార్తెను ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బరిలో నిలిపారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పీవీ ఘాట్‌ను కూల్చుతామంటే స్పందించని కేసీఆర్‌.. ఆయన కుమార్తెకు సీటు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.

వామనరావు హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కోసం కోరాలని డిమాండ్‌ చేశారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయాల కోసమే పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ సీటు: బండి సంజయ్‌

ఇవీచూడండి:'భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యపై అసత్యాలు'

ABOUT THE AUTHOR

...view details