తెలంగాణ

telangana

కరోనా వేళ క్రియేటివిటీ.. ఇంట్లో ఉంటూనే విమానయానం!

By

Published : Apr 18, 2020, 1:14 PM IST

అనుకోకుండా వచ్చిన కరోనా హాలిడేస్​ను ప్రజలు తమ మనసుకు నచ్చిన పనులు చేయడం కోసం వినియోగిస్తున్నారు. తమలో దాగున్న క్రియేటివిటీని బయటకు తీసి ఈ సెలవులను ఆనందంగా మల్చుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ కుటుంబం ఇంట్లో ఉంటూనే విమానయానం చేశారు. అది ఎలానో మీరే చూడండి.

AUSTRALIA FAMILY DONE FLIGHT JOURNEY IN HOME ONLY
కరోనా వేళ క్రియేటివిటీ.. ఇంట్లో ఉంటూనే విమానయానం!

ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన నాథన్‌ రస్సెల్‌, క్రిస్టీ దంపతులకు ముగ్గురు పిల్లలు. కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని రోజులుగా వీరి కుటుంబం స్వీయ నిర్బంధంలో ఉంది. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులంతా కలిసి విమానంలో మ్యూనిక్‌ (జర్మనీకి చెందిన నగరం)కు వెకేషన్‌కు వెళ్తున్నట్లు ఇంట్లోనే ఓ సెటప్‌ని సృష్టించారు. ఈ క్రమంలో రస్సెల్‌ ఫ్లైట్‌ టికెట్స్‌, బోర్డింగ్‌ పాస్‌లను కూడా ప్రింట్‌ చేశాడు. వీటితో పాటు ఇంట్లో ఉండే వస్తువులతోనే విమానాశ్రయ వాతావరణాన్ని తలపించేలా ప్లేన్‌ క్యాబిన్‌, సెక్యూరిటీ చెక్‌.. మొదలైన వాటిని కూడా అతను రూపొందించడం విశేషం. వీటికి సంబంధించిన ఫొటోలను క్రిస్టీ సోషల్‌ మీడియా ద్వారా పంచుకొంది. ఈ వినూత్న ఆలోచన ద్వారా తమ కుటుంబ సభ్యులంతా కలిసి 15 గంటల పాటు ఆనందంగా గడిపే అవకాశం లభించిందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది.

మా లాంజ్‌ రూమ్‌నే క్యాబిన్‌గా మార్చాం..!

మా 16 ఏళ్ల అబ్బాయి సెక్యూరిటీ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తే.. మా 9 ఏళ్ల పాప మా లగేజ్‌ని తనిఖీ చేసింది. మా 14 ఏళ్ల కూతురు మమ్మల్ని విమానంలోకి ఆహ్వానించింది.

ఈ సెక్యూరిటీ గేట్‌ ద్వారా మేము ఎకానమీ క్లాస్‌లోకి వెళ్లి సీట్లలో కూర్చున్నాం..!

ఈ ప్రయాణం కోసం ప్రత్యేకంగా రూపొందించిన బోర్డింగ్‌ పాస్‌లు..!

ఈ మూడు గంటల ఫ్లైట్‌ ప్రయాణాన్ని పిల్లలు బాగా ఎంజాయ్‌ చేశారు. చాలాకాలం తర్వాత మేమంతా కలిసి ఒకే గదిలో ఇన్ని గంటలు గడిపాం.

‘నిజానికి మేము ఈ వెకేషన్‌కు వెళ్లాలని గత 5 ఏళ్లుగా అనుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ, కరోనా వల్ల ఈసారి కూడా అది కుదర్లేదు. మా ప్రయాణం గురించి సరదాగా జోక్స్‌ వేస్తోన్న క్రమంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ, ఏదైతేనే ఈ ప్రయాణాన్ని మేమంతా బాగా ఎంజాయ్‌ చేశాం’ అని చెప్పుకొచ్చాడు రస్సెల్‌.

ఈ కుటుంబం లాగే కరోనా లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది తమ ప్రయాణాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు.. మొదలైన వాటిని వాయిదా వేసుకున్నారు. వీళ్లలో కొంతమంది ఇలా తమ సృజనాత్మకతతో ఇంటి నుంచే తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు.

ఇదీ చూడండి:-లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం

ABOUT THE AUTHOR

...view details