తెలంగాణ

telangana

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్మీ దినోత్సవం

By

Published : Jan 15, 2021, 10:39 AM IST

Updated : Jan 15, 2021, 11:45 AM IST

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్మీ దినోత్సవం జరిగింది. అమరజవాన్లకు ఆర్మీ ఉన్నతాధికారులు నివాళి అర్పించారు. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్న జవాన్లను సన్మానించారు.

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్మీ దినోత్సవం
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్మీ దినోత్సవం

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద మేజర్‌ జనరల్‌ ఆర్కేసింగ్‌ నివాళులర్పించారు. ఆర్మీ దినోత్సవాన్ని పురస్కరించుకొని... 1971 భారత్-పాకిస్థాన్‌ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను సన్మానించారు.

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్మీ దినోత్సవం

దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులైన సమీర్‌, వర్ష దంపతుల కుమార్తె నియోరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండేళ్ల క్రితం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సమీర్ దంపతులు... తమ కుమార్తెతో నియోరాతో కలిసి పాల్గొన్నారు.

జవాన్లను చూసి ముచ్చట పడిన చిన్నారి... ఆర్మీ దుస్తులు ధరిస్తానని తల్లిని కోరింది. ఈ విషయాన్ని సమీర్.. ప్రధాన మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మీ దుస్తులు వేసుకొని జనాన్లను కలవడానికి నియోరాకు అనుమతి లభించింది. ఆర్మీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నియోరా సంతోషం వ్యక్తం చేసింది

Last Updated : Jan 15, 2021, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details