తెలంగాణ

telangana

AP CM Jagan Letter to PM: తక్షణసాయంగా రూ.వెయ్యికోట్లు ఇవ్వండి.. ప్రధానికి జగన్‌ లేఖ

By

Published : Nov 24, 2021, 12:34 PM IST

AP CM Jagan Letter to PM on Floods: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు... ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని, తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు.

AP CM Jagan Letter to PM, AP FLOODS, jagan letter to pm on floods
వరదలపై కేంద్రానికి లేఖ

CM Jagan Letter to PM on Floods: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు.. వేరువేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. 4 జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైందన్న సీఎం.. తిరుపతి, తిరుమలలో వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగినట్లు తెలిపారు. నెల్లూరు, మదనపల్లె, రాజంపేటలోని పలు ప్రాంతాలు నీటమునిగినట్లు లేఖ (Jagan Letter to PM on Floods)లో వెల్లడించిన సీఎం.. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేశారు.

మొత్తం 196 మండలాలు నీటమునిగినట్లు (Floods in AP) పేర్కొన్న సీఎం జగన్.. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు లేఖలో తెలిపారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో రహదారులు, చెరువులు, కోతకు గురైనట్లు పేర్కొన్న సీఎం.. చెరువులకు గండ్లు పడటంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయని లేఖలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details