తెలంగాణ

telangana

Omicron variant: రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ కేసులు.. 38కి చేరిన సంఖ్య

By

Published : Dec 22, 2021, 9:36 PM IST

Updated : Dec 22, 2021, 10:28 PM IST

Another 14 Omicron variant cases in TS
రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదు

21:35 December 22

Omicron variant:రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ కేసులు.. 38కి చేరిన సంఖ్య

Omicron variant: రాష్ట్రంలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ కేసులతో రాష్ట్రంలో మొత్తం సంఖ్య 38కి చేరినట్లు వెల్లడించింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఆరుగురిలో ఒమిక్రాన్‌ సోకినట్లు తేలింది. నాన్‌రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 31 మందిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఒకరికి కాంటాక్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

RTPCR test in airport: ఇప్పటివరకు ఎట్‌రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 9,381 మంది ప్రయాణికులకు ఆర్‌జీఐఏలో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 63 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వారిలో 22 మందికి ఇప్పటికే ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చింది. మిగిలిన వారిలో 38 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలగా.. మరో నలుగురి ఫలితాలు రావాల్సి ఉంది.

కొత్తగా 182 కరోనా కేసులు

corona cases in TS: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 37,353 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 182 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,80,074కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,017కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 196 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,610 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Last Updated : Dec 22, 2021, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details