తెలంగాణ

telangana

'విఘ్నాలు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి'

By

Published : Sep 2, 2019, 8:33 PM IST

గణపతి పండుగ వచ్చిందటే చాలు పల్లెల నుంచి పట్నందాకా తొమ్మిది రోజులపాటు వినాయకుడి హడావుడి ఉంటుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరు పూజా కార్యక్రమాల్లో ఉత్సహంగా పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఇవాళ గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ​

ganesh

'విఘ్నాలు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి'

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్​ చతుర్థిని ఘనంగా జరుపుకున్నారు. భాగ్యనగరంలోని అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ కుటుంబ సమేతంగా పాల్గొని గణపతికి పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండి రైతుల బతుకు బంగారం కావాలని ఆ గణపతిని కోరుకున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.

గాంధీభవన్​లో ఘనంగా వినాయక చవితి వేడుక నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గణపతిని వేడుకున్నానని ఉత్తమ్​ పేర్కొన్నారు.

భాజపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వినాయక పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు, విద్యుత్ కనెక్షన్, మరుగు దొడ్లు తదితర మౌలిక సదుపాయలు కల్పించేందుకు కృషి చేస్తోందని లక్ష్మణ్ అన్నారు.


ప్రతి పనిలో మంచి జరగాలి...

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఘనంగా వేడుక నిర్వహించారు పార్టీ నేతలు. తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితోపాటు పలువురు ప్రత్యేక పూజలు చేశారు. చేపట్టే ప్రతి పనిలో మంచి జరగాలని నేతలు కోరుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రమణ, రావుల వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవీ చూడండి: 'ఖైరతాబాద్​ మహాగణపతి దర్శనానికి మళ్లీ వస్తాం'

ABOUT THE AUTHOR

...view details