తెలంగాణ

telangana

దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్​లో ధర్నా

By

Published : Dec 5, 2020, 2:17 PM IST

కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీ వేదికగా సాగుతున్న రైతుల ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. పదిరోజులుగా మోదీ సర్కార్ స్పందించకపోవడం పట్ల హైదరాబాద్​లో అఖిలపక్ష రైతు సంఘాలు నిరసనకు దిగాయి.

Hyderabad in support of the peasant movement in Delhi
దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్​లో ధర్నా

దిల్లీలో ఉద్ధృతంగా సాగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్​ గన్​పార్క్​ వద్ద అఖిలపక్ష రైతు సంఘాలు, వామపక్షాలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. కార్పొరేట్లను తరిమికొడదాం-రైతాంగాన్ని కాపాడుకుందాం అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. హరియాణా, యూపీ రాష్ట్రాల్లో రైతులపై దమనకాండ జరుగుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని అఖిలపక్ష రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇవాళ హస్తినలో రైతు సంఘాలతో కేంద్రం జరిపే చర్చల్లో రైతాంగం ప్రయోజనాలకు విఘాతం కల్పించే మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాలని ఏఐకేఎస్‌సీసీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకటరామయ్య డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details