తెలంగాణ

telangana

పరీక్షలో 94 వచ్చాయని.. ట్రాఫిక్​ పోలీసులతో గొడవ పడిన యువకుడు

By

Published : Feb 28, 2023, 2:13 PM IST

Young man had a fight with the traffic police in HYD: తాగి వాహనం నడపరాదని పెద్దలు, ఆత్మీయులు ఎంత చెప్పిన కొంత మంది వ్యక్తులు ఆ మాటలను పెడచెవిన పెడతారు. అలానే హైదరాబాద్​లోని ఓ యువకుడు ట్రాఫిక్​ పోలీసులతో గొడవ పడ్డాడు. ట్రాఫిక్​ పోలీసులు యువకుడిపై బంజారాహిల్స్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

A young man fighting with the traffic police
ట్రాఫిక్​ పోలీసులతో గొడవ పడుతున్న యువకుడు

Young man had a fight with the traffic police in Banjara Hills: ప్రస్తుత కొందరి యువకుల్లో సహనం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో ఎదుటి వ్యక్తులతో వాగ్వాదానికి దిగుతున్నారు. చాలా మంది మద్యం మత్తులో ఏమి చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ఎక్కువగా తాగి వాహనాలు నడపడం వలన వారికే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా ఎంతో ప్రమాదకరం. ఈ విషయం సినిమాల్లోనూ, పోలీసులు బహిరంగంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు.. తదితర సందర్భాల్లో చెప్పుతుంటారు.

అయినా కొంత మంది వ్యక్తులు ఈ నిబంధనలను పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తుల కోసమే ట్రాఫిక్ పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో కొంత వరకు ప్రమాదాలను అరికట్టగలగుతున్నాం. ఈ పరీక్ష చేస్తున్నప్పుడు కొందరు యువకులు మత్తులో చేయరాని తప్పులు చేస్తున్నారు. తమకు చాలా పవర్​ ఉంది తమని ఏమని అనవద్దని బెదిరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులను కొడుతున్నారు. ఇలా చేయడంతో వారిపై పోలీసులు కేసులు పెట్టడంతో జైలు పాలవుతున్నారు. దీంతో వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్​లోని ఓ యువకుడు తాగి కారు నడపుతుంటే ట్రాఫిక్ పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ టెస్ట్​ నిర్వహించారు. టెస్ట్​లో మద్యం తాగినట్టు తెలిసి అక్కడే ఆపి వేశారు. దీంతో ట్రాఫిక్​ పోలీసులకు ఆ యువకుడి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి హైదరాబాద్​లోని బంజారా హిల్స్​లో మద్యం మత్తులో యువకుడి వీరంగం సృష్టించాడు.

కారులో ప్రయాణిస్తున్న యువకుడిని బంజారాహిల్స్​లో ట్రాఫిక్​ పోలీసులు ఆపి డ్రంక్​ అండ్ డ్రైవ్​ టెస్ట్​ నిర్వహించారు. ఈ టెస్ట్​లో ఆ యువకుడికి 94bac పాయింట్లు వచ్చాయి. దీంతో ట్రాఫిక్​ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఆ యువకుడు పోలీసులపై రెచ్చిపోయి దుర్భాషలాడాడు. ట్రాఫిక్ ఎస్ఐ మీద దుర్భాషలు ఆడుతూ.. తనకు హైకోర్టు జడ్జి తెలుసు..అంటూ బెదిరించాడు. ఆ యువకుడు ఎస్ఐని కాలితో తన్నాడు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్​లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడు హైకోర్టులో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అతను ప్రయాణిస్తున్న కారులో ఒక మహిళ కూడా ఉంది.

ట్రాఫిక్​ పోలీసులతో గొడవ పడిన యువకుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details