తెలంగాణ

telangana

Trains Cancelled From Secunderabad : కోరమండల్​ ఎఫెక్ట్​.. ఒడిశా వైపు వెళ్లే రైళ్లు రద్దు

By

Published : Jun 4, 2023, 5:29 PM IST

9 Trains Cancelled From Secunderabad : కోరమండల్​ ఎక్స్​ప్రెస్​ రైలు ప్రమాదానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 9 రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఒడిశా మీదగా ప్రయాణించే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలపడంతో.. ప్రత్యామ్నాయ రైళ్ల కోసం ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడ్డారు. రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Trains Cancelled
Trains Cancelled

9 Trains Cancelled From Secunderabad : ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం వల్ల దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 రైళ్లను రద్దు చేసినట్లు ఎస్​సీఆర్​ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ - శాలిమర్, సంత్రగచ్చి - తిరుపతి, హౌరా -ఎస్.ఎం.వీ.టీ బెంగళూరు, శాలిమార్ - ఎం.జీ.ఆర్ చెన్నై సెంట్రల్, వాస్కోడగామా - హౌరా ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరోపక్క ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం ప్రభావం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పైన పడింది.

ప్రమాదం నేపథ్యంలో ఒడిశా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయంలో ప్రయాణికులకు సరైన సమాచారం లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఏ రైలు రద్దు చేశారో.. ఏ రైలు ఏ సమయానికి బయలుదేరుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు ఉన్నారు. దీంతో వారందరూ గందరగోళానికి గురవుతున్నారు. ఫలితంగా విపరీతమైన రద్దీ నెలకొంది. విచారణ కౌంటర్​లో సంప్రదించినప్పటికీ సరైన సమచారం లేకపోవడంతో ప్రయాణికులకు నిరాశే మిగిలింది. తమ గొడును వినే నాదుడే లేడా అంటూ మెరపెట్టుకుంటున్నారు.

Trains Cancelled South Central Railway : అయితే శనివారం కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 19 రైళ్లను రద్దుచేసినట్లు ఎస్​సీఆర్​ చీఫ్​ పీఆర్​వో రాకేశ్​ వివరించారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. రద్దు చేసిన రైళ్లలో రిజర్వేషన్​ చేసుకున్న ప్రయాణికులు టికెట్​ డబ్బులను వాపస్​ చేసుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం నుంచి రిజర్వేషన్​ చేసిన రైల్వే స్టేషన్​కి వెళ్లి టికెట్​ కౌంటర్​ వద్ద టికెట్ చూపిస్తే నగదు తిరిగి ఇస్తారన్నారు. ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే అని అన్నారు. ఆన్​లైన్​లో రిజర్వేషన్​ చేసిన ప్రయాణికులకు ఆటోమెటిక్​గా డబ్బులు తమ ఖాతాల్లోకి జమ అవుతాయని పేర్కొన్నారు. ఒడిశాలోలని కోరమాండల్​ రైలు ప్రమాదంతో.. సికింద్రాబాద్​ ప్రధాన రైల్వే స్టేషన్​కు దాని సెగ తగిలింది.

ఊపిరి పీల్చుకున్న అధికారులు : ఒడిశాలోని బాలాసోర్​లో ప్రమాదానికి కోరమండల్​ సూపర్​ ఫాస్ట్​, హౌరా మెయిల్​​ ఎక్స్​ప్రెస్​ రైళ్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్​కు చెందిన ప్రయాణికుడు కోరమండల్​లో ప్రయాణిస్తున్నట్లు.. సోషల్​ మీడియాలో వీడియో వైరల్​ అయింది. అయితే అతనికి సంబంధించిన సమాచారం రైల్వే అధికారుల ఇవ్వలేదు. అయినా ఈ రెండు రైళ్లు తెలంగాణ రూట్లలో ప్రయాణించవు. కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details