తెలంగాణ

telangana

నేడే 74వ ఐపీఎస్​ బ్యాచ్​ పాసింగ్​ అవుట్​ పరేడ్​.. ముఖ్య అతిథిగా అమిత్​షా

By

Published : Feb 11, 2023, 7:44 AM IST

74th IPS Batch Passing Out Parade: నేడే 74వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్​ అధికారుల పాసింగ్​ అవుట్​పరేడ్​.. ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్​షా హాజరుకానున్నారు. జాతీయ పోలీస్​ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు ఏడుగురిని కేటాయించారు.

ips
ఐపీఎస్​

Amit Shah Is Chief Guest At 74th IPS Batch Passing Out Parade: సర్ధార్ వల్లభ్‌బాయి పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 74 వ బ్యాచ్ ఐపీఎస్​ అధికారులు పాసింగ్‌ అవుట్‌పరేడ్‌ నిర్వహించనున్నారు. ఆ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ పొందగా.. వారిలో 41 మంది మహిళలు ఉన్నారు. ఆ 195 మందిలో 166 మంది ఐపీఎస్​లు కాగా.. వారిలో 37 మంది మహిళలు ఉన్నారు.

మిగిలిన 29 మంది విదేశీ క్యాడెట్లు. విదేశీయుల్లో నేపాల్‌, భూటాన్‌, మాల్ దీవ్స్‌, మారిషస్ క్యాడెట్లు శిక్షణ తీసుకున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ఐపీఎస్​ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కవాతు ప్రదర్శన వీక్షించిన తర్వాత అమిత్‌ షా.. అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం భోజన విరామం తర్వాత దిల్లీ తిరిగి దిల్లీ వెళ్లనున్నారు.

వీరికి కరోనా కారణంగా అక్టోబర్‌లో పూర్తి కావాల్సిన ట్రైనింగ్‌.. నాలుగు నెలలు ఆలస్యమైంది. 74వ బ్యాచ్‌లో మొత్తం 195 మంది శిక్షణ తీసుకోగా.. వారిలో 41 మంది మహిళలు ఉన్నారు. గతంతో పోలిస్తే మహిళా ఐపీఎస్​ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐపీఎస్​లలో ఎక్కువగా ఇంజనీరింగ్ చేసిన వారే అధికంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న 166 మందిలో ఇంజినీరింగ్ చదివినవారే 114 మంది ఉన్నారు.

74th IPS Batch Passing Out Parade: కరోనా వల్ల 74వ బ్యాచ్‌ ఆలస్యం కావడంతో ఈసారి 75వ బ్యాచ్‌కి అకాడమీలో శిక్షణ సాగుతోంది. ప్రస్తుతం అకాడమీలో సుమారు 400 మంది క్యాడెట్లు ఉన్నారు. అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన కేరళకి చెందిన కేఎస్ షెహన్‌షా.. పాసింగ్ అవుట్ పరేడ్‌ మాండర్‌గా వ్యవహరించనున్నారు. షెహన్‌షా సివిల్స్‌లో ఆరు ప్రయత్నాల్లో విఫలమైనా.. ఏడో ప్రయత్నంలో 142వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ దక్కే అవకాశమున్నా పోలీస్‌ ఉద్యోగంపై ఇష్టంతో ఐపీఎస్​ను ఆమె ఎంచుకున్నారు.

మెకానికల్ విభాగంలో బీటెక్‌ పూర్తిచేసిన తర్వాత.. స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో అథ్లెటిక్స్‌లో శిక్షణ పొంది 8ఏళ్లలో 30 రాష్ట్ర, 14 జాతీయ పతకాలు సాధించారు. ఆ తర్వాత సీఐఎస్​ఎఫ్​లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా.. ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్ సర్వీస్‌లో డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆ బ్యాచ్‌ నుంచి తెలంగాణకు ఐదుగురు, ఏపీకి ఇద్దరు ఐపీఎస్​లను కేటాయించారు. సమాజంలో ఉన్న సమస్యలు పూర్తి స్థాయిలో పారదోలేందుకు తమవంతు కృషి చేస్తామని క్యాడెట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details