తెలంగాణ

telangana

ఆందోళనకరస్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే!?

By

Published : Jun 25, 2022, 7:40 PM IST

రాష్ట్రంలో కొత్తగా 496 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారినుంచి మరో 205 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,613 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

CORONA CASES: ఆందోళనకరస్థాయిలో కరోనా కొత్త కేసులు.. ఈరోజు ఎన్నంటే..?
CORONA CASES: ఆందోళనకరస్థాయిలో కరోనా కొత్త కేసులు.. ఈరోజు ఎన్నంటే..?

రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఆందోళనకరస్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28,808 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 496 కొత్త కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినుంచి మరో 205 మంది కోలుకోగా.. ప్రస్తుతం 3,613 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా మరణాలు నమోదు కాకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.

కొత్త కేసుల్లో గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం, కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details